(Source: ECI/ABP News/ABP Majha)
Abnormal Dinosaur Eggs In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ గుడ్లు- ఇవి చాలా ప్రత్యేకం!
Abnormal Dinosaur Eggs In Madhya Pradesh: ఎన్నో మిలియన్ల సంవత్సరాల కింద అంతరించిపోయిన డైనోసార్ల అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన డైనోసార్ల గుడ్లు బయటపడ్డాయి.
Abnormal Dinosaur Eggs In Madhya Pradesh: డైనోసార్లు.. ఈ పేరు వింటేనే మన కళ్ల ముందు ఓ భయంకరమైన ఆకృతి మెదులుతోంది. భౌతికంగా డైనోసార్లు భూమి మీద లేకపోయినా ఇప్పటికీ సినిమాల ద్వారా మనకు పరిచయమే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్‌లో ఈ డైనోసార్లు చేసిన పోరాటాలు అయితే ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయా? అసలు ఇప్పుడు లేవా?
Researchers from University of Delhi discovered a unique set of fossilised eggs.The discovery was made in Dinosaur Fossil National Park in Madhya Pradesh's Dhar district and one of the eggs was found nesting inside the other.The eggs belong to titanosaurs.#thejuniorage #dinosaur pic.twitter.com/yfcQ5pLALf
— The Junior Age (@TheJuniorAge) June 14, 2022
భారత్‌లో
డైనోసార్ల జాతి మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు.
దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్‌లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి చాలా భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు.
పక్షుల్లా
ఈ గుడ్లు సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా పరిశోధకులు నిర్ధారించారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉంది. ఇలాంటి వాటిని 'ఓవమ్ ఇన్ ఓవో' అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుంది. దీంతో టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని బడవానీ అడవిలో ఇటీవల 10 డైనోసార్ రాతి గుడ్లను కనుగొన్నారు. వీటిలో ఒక గుడ్డు 40 కేజీలు ఉండగా, మిగతావి 25 కేజీలు మేర ఉన్నాయి. వీటిని ఇందోర్ మ్యూజియంలో ఉంచారు.
Also Read: Covid Update: దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు- ఎంత మంది మృతి చెందారంటే?
Also Read: Indian Railways Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- లక్షన్నర ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ప్రకటన