అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Indian Railways Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- లక్షన్నర ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ప్రకటన

Indian Railways Jobs: భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ప్రకటన చేసింది. ఏడాదిలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

Indian Railways Jobs: నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది వరకు లక్షా 48వేల 463 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. గత 8 ఏళ్లలో ఏడాదికి సగటున 43,678 ఉద్యోగాలే భర్తీ చేసింది రైల్వేశాఖ. అయితే ఈసారి భర్తీ చేసే ఉద్యోగాలను భారీగా పెంచింది.

రాబోయే 18 నెలల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించిన వెంటనే రైల్వేశాఖ ఈ ప్రకటన చేయడం విశేషం.

భారీగా ఖాళీలు

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2020 మార్చి 1 నాటికి 31.91 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి) ఉన్నారు. అయితే ఉండాల్సిన సంఖ్య 40.78 లక్షలు. అంటే దాదాపు 21.75 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 92 శాతం మేన్ పవర్.. రైల్వే, రక్షణ, హోంశాఖ, పోస్టల్, రెవెన్యూ ఇలా ఐదు శాఖల్లోనే ఉంది. ఇందులో ఒక్క రైల్వేశాఖదే 40.55 శాతం (కేంద్ర పాలిత ప్రాంతాలు కాకుండా) ఉంది.

మోదీ ఆదేశం

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల జాబితాను వెంటనే వెలికితీయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు సమాచారం. దీంతో 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మోదీ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన చాలా ఎన్నికల్లో నిరుద్యోగం అంశం తెరపైకి తెచ్చి విపక్షాలు.. మోదీ సర్కార్‌ను ఇరుకున పెడుతున్నాయి. దీంతో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

2014-15 నుంచి 2021-22 వరకు రైల్వేశాఖ 3,49,422 మందిని రిక్రూట్ చేసుకుంది. అంటే ఏడాదికి సగటున 43,678 ఉద్యోగాలు. అయితే 2022-23లో ఈ సంఖ్యను భారీగా పెంచి 1,48,463 మందిని భర్తీ చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, ఖాళీల వివరాలపై అన్ని శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రధాని నిర్ణయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది.

Also Read: PM Modi on Jobs: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త - త్వరలోనే 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని మోదీ నిర్ణయం

Also Read: Chhattisgarh: ఈ పిల్లోడు మామూలోడు కాదు,పక్కనే పామున్నా బెదరలేదు-బహదూర్ అంటూ ట్వీట్ చేసిన సీఎం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget