అన్వేషించండి

Chhattisgarh: ఈ పిల్లోడు మామూలోడు కాదు,పక్కనే పామున్నా బెదరలేదు-బహదూర్ అంటూ ట్వీట్ చేసిన సీఎం

ఛత్తీస్‌గఢ్‌లో బోర్‌వెల్‌లో పడిపోయిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. 100 గంటలకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.

బోర్‌వెల్ నుంచి సురక్షితంగా బయటకొచ్చిన బాలుడు

ఛత్తీస్‌గఢ్‌లోని 70 అడుగుల లోతులో పడిపోయిన 11 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు దాదాపు నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అధికారులు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుతగలటం వల్ల తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. తరవాత రోబోలను తీసుకొచ్చి బాలుడిని రక్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొత్తానికి 100 గంటల తరవాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాదాపు 500 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది శ్రమించి బాధితుడిని రక్షించారు. ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్. బాలుడి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు.

 

100 గంటల పాటు పాము, కప్పతోనే
అంత లోతులో బాలుడితో పాటు ఓ కప్ప, పాము కూడా ఉన్నాయట. అయినా ఏ భయం లేకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సహకరించాడు బాలుడు. అందుకే సీఎం భూపేష్ బాగేల్ ఆ బాలుడ్ని ఆకాశానికెత్తేశారు. హమారా బచ్చా బహదూర్‌ హై (ఈ పిల్లాడు ఎంతో ధైర్యవంతుడు) అంటూ ట్వీట్‌ చేశారు. 104 గంటల పాటు పాముతోనే ఉండాల్సి వచ్చినా ఏ మాత్రం భయపడకుండా ఉండటం సాధారణ విషయం కాదని అన్నారు సీం భూపేష్. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ సహాయక చర్యల్లో పాలు పంచుకున్న అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాలుడిని బయటకు తీసుకురావటం ఎంతో సవాలుతో కూడుకున్న పని. కానీ సిబ్బంది ఎంతో స్ట్రాటెజిక్‌గా ఆలోచించి పని పూర్తి చేశారని వివరించారు.  ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి వీడియో కాల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించారు సీఎం భూపేష్ బాగేల్. బోర్‌వెల్‌ ద్వారానే బాలుడికి అరటిపండ్లు, బిస్కెట్లతో పాటు ఆక్సిజన్‌నీ అందించారు. మొదటి మూడు రోజులు రెస్క్యూ 
ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆ సమయంలోనే గుజరాత్‌ వాసి ఒకరు రోబోల సాయంతో బాలుడిని బయటకు తీసుకు రావచ్చని సూచించారు. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్‌ల కోసమే తాను ప్రత్యేకంగా రోబోలను తయారు చేశానంటూ చెప్పారు. వెంటనే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ఆయనను సంప్రదించారు. రోబో సాయంతో మొత్తానికి బాలుడిని సురక్షింతగా బయటకు తీసుకొచ్చారు. మరెక్కడ బోర్‌వెల్స్ ఉన్నా వాటిని సరైన విధంగా మూసివేయాలంటూ ఎస్‌పీలు,కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అప్పటికప్పుడు హడావుడి చేస్తున్నారే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించటం లేదు. బోర్‌వెల్స్‌ని సరైన విధంగా కప్పి ఉంచాలన్న ఆదేశాలనూ ఎవరూ పట్టించుకోవటం లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Rajya Sabha: ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
Breaking News: సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Maruti Ethanol Car:పెట్రోల్‌కు కాలం చెల్లిందా? జూన్‌ 5న మారుతి
రూ. 4 ఖర్చు... 18 కిలోమీటర్ల మైలేజ్‌! మారుతి సుజుకి ఇథనాల్ కార్ వచ్చేస్తోంది... పూర్తి వివరాలు ఇవే!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Embed widget