PM Modi on Jobs: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త - త్వరలోనే 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని మోదీ నిర్ణయం
Government Jobs 2022: కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, ఖాళీల వివరాలపై అన్ని శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
PM Modi on Jobs 2022: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, ఖాళీల వివరాలపై అన్ని శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రధాని నిర్ణయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఉద్యోగాల భర్తీ కోసం పలు రాష్ట్రాలు డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు 2 మిలియన్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు తరచుగా విమర్శిస్తుంటాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించింది. ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీపై డిమాండ్లు రావడం, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో నిరుద్యోగిత ఒకటి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
— PMO India (@PMOIndia) June 14, 2022
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్
ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. అయితే ఇతర దేశాలతో భారత్ నిలదొక్కుకున్నట్లు కనిపించింది. కానీ చైనా, భారత్ లాంటి దేశాల్లో జనాభా ఎక్కువ కనుక దీర్ఘకాలిక మందగమనంలోకి వెళ్లిపోయాం. కరోనా వ్యాప్తి తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. దీంతో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలం తరువాత నిరుద్యోగులకు కేంద్రం నిర్ణయం ఊరటనివ్వనుంది.
కరోనా మొదలైన 2020లో అమెరికా లాంటి అగ్రరాజ్యం సహా పలు దేశాల్లో నిరుద్యోగం పెరిగింది. జనాభా ఎక్కువగా ఉండే భారత్‌లో ఇది మరింత ఎక్కువైంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ కంటే కూడా భారత్‌లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉంది.
Also Read: APTET August - 2022 Notification: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు లాస్ట్ డేట్, ఇతర వివరాలు ఇవే
Also Read: IBPS RRB 2022: IBPS RRBలో 8 వేల ఉద్యోగాలు- నేటి నుంచే రిజిస్ట్రేషన్, ఇలా అప్లై చేయండి!