Covid Update: దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు- ఎంత మంది మృతి చెందారంటే?
Covid Update: దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు.
Covid Update: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 8,822 మంది కరోనా బారిన పడ్డారు. 15 మంది మృతి చెందారు. తాజాగా 5,718 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది.
#COVID19 | India reports 8822 new cases, 5718 recoveries and 15 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 15, 2022
Active cases 53,637
Daily positivity rate 2% pic.twitter.com/NiaCD58DY6
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,245,517
- మొత్తం మరణాలు: 5,24,792
- యాక్టివ్ కేసులు: 53,637
- మొత్తం రికవరీలు: 4,26,67,088
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 13,58,607 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,50,87,271 కోట్లకు చేరింది. మరో 4,40,278మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పగా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్రం సూచించింది.
Also Read: Indian Railways Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- లక్షన్నర ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ప్రకటన
Also Read: Chhattisgarh: ఈ పిల్లోడు మామూలోడు కాదు,పక్కనే పామున్నా బెదరలేదు-బహదూర్ అంటూ ట్వీట్ చేసిన సీఎం