అన్వేషించండి

Vizag Google: మారనున్న విశాఖ రాత - చరిత్రాత్మక గూగుల్ ఎఐ హబ్ ఒప్పందానికి రంగం సిద్ధం

Google Data hub: దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో ఏర్పాటు కానుంది. ఒప్పందం మంగళవారం ఢిల్లీలో జరగనుంది.

Visakhapatnam to be transformed AI Hub:  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్ ఇమేజ్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషితో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇది ఎపి చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఎఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయుపై న్యూ ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ)గా రికార్డు సృష్టించబోతోంది. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు.  

నారా లోకేష్ అమెరికా పర్యటనతో మొదటి అడుగు

రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వతేదీన శాన్ ఫ్రాన్సిస్కో లో గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎఐ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆ తరువాత గూగుల్ ప్రతినిధులతో పలుదఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ పూర్తి AI సాంకేతిక వేదికను ఆతిథ్యం ఇవ్వగల అవకాశం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ సంస్థ రాబోయే అయిదేళ్లలో (2026–2030 మధ్య) సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్థాయి. రాష్ట్రంలోని యువత కోసం విస్తృత స్థాయి ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. అలాగే, ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నొవేషన్ రంగాల్లో  విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వ్యాపార అనుకూల విధానాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి ఎఐ ఎక్సలెన్స్ సెంటర్ గా అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. 

ఏఐ సిటీగా విశాఖ 

గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతోంది. విశాఖలో ఏర్పాటుచేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేధ (AI) వ్యవస్థను అమలు చేసి, భారతదేశంలో AI ఆధారిత ట్రాన్సఫర్మేషన్ ను వేగవంతం చేయనుంది. ఈ కొత్త AI హబ్ లో అత్యాధునిక AI మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను ఒకేచోట సమన్వయపరచి, విశాఖపట్నాన్ని భారతదేశ AI ట్రాన్సఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో సముద్ర గర్బ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్ట్ 2028–2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్‌డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఆమోదం పొందింది. ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ప్లగ్-అండ్-ప్లే మౌలిక వసతులను ఎపి ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు, ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలు సమన్వయంతో అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Advertisement

వీడియోలు

India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Embed widget