Chandrababu meet Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. కర్నూలులో నిర్వహించనున్న సూపర్ జీఎస్టీ- సూపర్ సభకు రావాలని ఆహ్వానించారు.

Chief Minister Chandrababu Naidu met with Prime Minister Modi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకే ప్రయోజనం చేకూర్చే "Next Gen GST" సంస్కరణలను ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. GST తాజా సంస్కరణల వల్ల ఆర్థిక లాభాలు, ప్రజలకు నేరుగా సేవింగ్స్ అందుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో నిర్వహించనున్న ‘ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ’ సభకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. అసలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న "CII Partnership Summit 2025" కు కూడా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
It was an honour to meet the Hon’ble Prime Minister, Shri Narendra Modi ji, in New Delhi today.
— N Chandrababu Naidu (@ncbn) October 13, 2025
On behalf of my people of Andhra Pradesh, I congratulated him on the remarkable milestone of 25 years in public service as Head of Government, and expressed our appreciation for his… pic.twitter.com/2rWs0y57UZ
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ కు ఢిల్లీలో అవగాహన ఒప్పందం జరుగనుంది. దాదాపు 480 ఎకరాల్లో రూ.87,520 కోట్ల పెట్టుబడి రైడెన్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. జిల్లాలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం పరిధిలో మూడు అతి పెద్ద డేటా సెంటర్లు రానున్నాయి. ఇందుకు అవసరమైన భూమిని గూగుల్ సంస్థే ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్‌కు సింగపూర్ లేదా వారికి అనువైన ఇతర ప్రాంతాల నుంచి సముద్రగర్భం ద్వారా కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ కారణంగా మరిన్ని డేటా సెంటర్లు విశాఖలో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
Chief Minister of Andhra Pradesh, Shri @ncbn met Prime Minister @narendramodi.@AndhraPradeshCM pic.twitter.com/P1mg5MFqRb
— PMO India (@PMOIndia) October 13, 2025
విశాఖ ఏఐ స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందనుంది. దీని ద్వారా మొత్తం రూ.1,27,181 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 78,771 మంది ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.





















