![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Online Betting Ads Ban : ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థల ప్రకటనలు అన్ని చోట్లా నిషేధం - కొత్త రూల్స్ తెచ్చిన కేంద్రం !
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నియంత్రించేందుకు కేంద్రం వాటి ప్రకటనలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. డిజిటల్ మీడియాలోనూ వాటి ప్రకటనలు కనిపించకూడదు.
![Online Betting Ads Ban : ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థల ప్రకటనలు అన్ని చోట్లా నిషేధం - కొత్త రూల్స్ తెచ్చిన కేంద్రం ! Centre issues advisory for ads on online betting, gambling Online Betting Ads Ban : ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థల ప్రకటనలు అన్ని చోట్లా నిషేధం - కొత్త రూల్స్ తెచ్చిన కేంద్రం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/e749122edae96ce02f7132a75bc9eeb6_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Rules For Online Betting Ads : దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ జాడ్యంలా విస్తరిస్తూండటంతో అనేక దుష్ఫరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి లక్షలు పోగొట్టుకుని నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవస్థను నియంత్రించాలని నిర్ణయించుకుంది. అలాంటి సంస్థల ప్రకటనలపై కొత్త నియామవళి జారీ చేసింది. అలాంటి ప్రకటనలను పూర్తిగా నిషేధించింది.
ప్రజలకు ముప్పుగా మారిన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ !
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనలపై నిషేధం విధిస్తూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. వినియోగదారులకు ఇవి సామాజికార్ధిక ముప్పుగా పరిణమిస్తున్నందున ఈ తరహా ప్రకటనలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ వేదికలకు సంబంధించిన ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కేంద్రం కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.
శ్రీలంకలో అదానీ పవర్‌పై రాజకీయ దుమారం - అక్కడేం జరుగుతోందంటే ?
అన్ని మాధ్యమాల్లోనూ ఆన్ లైన్ బెట్టింగ్ యాడ్స్ నిషేధం !
పలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, ఆన్‌లైన్ మీడియాలో పెద్దసంఖ్యలో ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్స్, ప్లాట్‌ఫాంల గురించిన ప్రకటనలు వెల్లువెత్తిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను దేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తారని, వీటిపై ప్రకటనలు ముఖ్యంగా చిన్నారులు, యువతకు సామాజికార్ధిక ముప్పుగా పరిణమించాయని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీని ఈడీ ఏమడిగిందో తెలుసా?- 3 గంటల పాటు విచారణ
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారాలు !
నిషేధిత కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇవి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్ధమని పేర్కొంది. ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978కి విరుద్ధంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్‌ను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ప్రజా ప్రయోజానాలను కాపాడే క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తాజా మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపింది. ఇంతకు ముందే సరోగేట్ యా్డ్స్ నిరోధానికి ప్రత్యేకమైన నిబంధనలు ప్రకటించడంతో.. ఇక పరోక్షంగానైనా ఈ ఆన్ లైన్ బెట్టింగ్ సంస్థలు ప్రకటనలు ఇవ్వడానికి అవకాశం ఉండదని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)