అన్వేషించండి

Jack Dorsey Interview: 'రైతుల నిరసన టైంలో ఒత్తిడి తెచ్చింది- మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు ఆరోపణలు- తప్పుపట్టిన కేంద్ర మంత్రి

Jack Dorsey Interview: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు, రైతుల ఉద్యమ సమయంలో భారత ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చిందని జాక్ డోర్సే ఆరోపించారు.

Jack Dorsey Interview: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మోడీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ఉద్యమ సమయంలో విమర్శలు చేసిన వారి ఖాతాలను సస్పెండ్ చేయాలని భారత ప్రభుత్వం ట్విటర్‌పై ఒత్తిడి తెచ్చిందని ఆయన ప్రధాన ఆరోపణదీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేశాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై మోడీ ప్రభుత్వంలోని మంత్రి స్పందించారు. జాక్ డోర్సీ చేసిన ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ట్విట్టర్ ప్రతిసారీ భారత చట్టాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

జాక్ డోర్సీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'జాక్ డోర్సీ అబద్ధాలను చెప్పారు. బహుశా ట్విట్టర్ చరిత్రలో అత్యంత అనుమానాస్పదమైన అంశాన్ని చెరిపేసే ప్రయత్నం కావచ్చు. డోర్సీ , అతని బృందం పదేపదే భారత చట్టాలను ఉల్లంఘించారు. వాస్తవానికి, ట్విట్టర్ 2020 నుంచి 2022 వరకు భారతీయ చట్టాలను పట్టించుకోలేదు. జూన్ 2022లో సమ్మతించారు. ఈ సమయంలో ఏ ట్విటర్ అధికారి జైలుకు వెళ్లలేదు, ట్విటర్‌ బ్యాన్ కాలేదు. డోర్సీ కాలంలో భారత చట్టాలను అంగీకరించడానికి ట్విటర్ ఇబ్బంది పడింది. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

జాక్ డోర్సీ ఏం చెప్పారంటే..
బ్రేకింగ్ పాయింట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ డోర్సీని ట్విట్టర్‌లో ఉన్నప్పుడు ఏ దేశ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా అని అడిగారు. దీనిపై డోర్సే స్పందిస్తూ, రైతుల నిరసన సమయంలో, ప్రభుత్వాన్ని విమర్శించే అనేక ట్విట్టర్ హ్యాండిల్స్‌ను నిషేధించాలని తనను కోరారని చెప్పారు. అలా చేయని పక్షంలో అధికారుల ఇళ్లపై దాడులు చేసి భారత్‌లో ట్విటర్‌ను మూసివేస్తామని హెచ్చరించారు. భారత్‌తోపాటు టర్కీ ప్రభుత్వాన్ని కూడా ప్రస్తావించిన డోర్సీ అక్కడి ప్రభుత్వం కూడా ట్విటర్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తోందని, బెదిరించిందని అన్నారు.

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడి ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ మరింత వైరల్ అవుతోంది. అన్ని ప్రతిపక్ష నేతలు దాన్ని షేర్ చేస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 

Also Read: పరుగులు పెడుతున్న పారిశ్రామిక రంగం, భారీగా పెరిగిన ఉత్పత్తి

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget