అన్వేషించండి

CAA New Portal: సీఏఏకు కొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం - దరఖాస్తు ఎలా చేయాలంటే?

CAA: కేంద్ర ప్రభుత్వం సీఏఏ కింద దరఖాస్తు చేసుకునే వారి కోసం మంగళవారం కొత్త వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. తర్వలోనే CAA - 2019 పేరుతో మొబైల్ యాప్ ను సైతం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది.

Central Government Launches CAA New Portal: కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) అమలుకు సోమవారం సాయంత్రం కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పించే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త వెబ్ పోర్టల్ (CAA Web Portal) ప్రారంభించింది. https://indiancitizenshiponline.nic.in తో పాటు CAA - 2019 పేరుతో మొబైల్ యాప్ ను సైతం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించింది. కాగా, 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు హింసకు గురై భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు. వారి వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి మన పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. భారత్‌లో 11  ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఉన్న నిబంధనను పూర్తిగా సవరించింది మోదీ సర్కార్. గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్‌లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

దరఖాస్తు ఇలా

 పౌరసత్వం కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు https://indiancitizenshiponline.nic.in పోర్టల్ కు వెళ్లి.. 'సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తుల సమర్పణ' అనే బటన్ పై క్లిక్ చేయాలి.

 అనంతరం మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, ఈ మెయిల్ ఐడీ ఇతర వివరాలు నమోదు చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. 

 అనంతరం వివరాలన్నీ సరి చూసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తే.. ఈ మెయిల్, మొబైల్ కు ఓ ఓటీపీ వస్తుంది. దీని వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్ కోసం మళ్లీ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

 తర్వాత, మీ పేరుతో లాగిన్ అయ్యి 'న్యూ అప్లికేషన్' బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన మీకు సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

 అప్లై చేసే క్రమంలో దరఖాస్తుదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

వీటితో పాటే 2014, డిసెంబర్ 31వ తేదీకి ముందే భారత్ లోకి ప్రవేశించారని రుజువు చూపే డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.

 దేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్ స్టాంప్, భారత్ లో జారీ చేసిన రేషన్ కార్డు, ఒకవేళ ఇక్కడే జన్మిస్తే బర్త్ సర్టిఫికెట్, రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంట్, పాన్ కార్డు, విద్యుత్ బిల్లులు, బీమా పాలసీలు, మ్యారేజ్ సర్టిఫికెట్ ఇలా ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది.

అయితే.. సీఏఏ చట్టం నుంచి గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో ఉండడం వల్ల అసోంలోని కర్బీ అంగ్‌లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చమ్‌కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను ఇందులో నుంచి మినహాయించింది. 

Also Read: Nayab Singh Saini: హరియాణాలో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం - నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Weather Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Embed widget