Bihar News: కుమారుడి శవం ఇచ్చేందుకు లంచం డిమాండ్- డబ్బుల్లేక తండ్రి భిక్షాటన!
Bihar News: కుమారుడి మృతదేహం ఇవ్వడానికి ఓ ఆసుపత్రి రూ.50 వేలు డిమాండ్ చేయడంతో ఆ తల్లిదండ్రులు భిక్షాటన చేశారు.
Bihar News: కన్నకొడుకు మృతదేహం కోసం యాచకులుగా మారారు ఆ తల్లిదండ్రులు. కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.50 వేలు లంచం అడిగాడు ఆసుపత్రిలో పని చేసే ఓ ఉద్యోగి. బిహార్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటన యావత్ దేశాన్ని ఆవేదనకు గురిచేస్తుంది.
Samastipur, Bihar | Parents of a youth beg to collect money to get the mortal remains of their son released from Sadar Hospital after a hospital employee allegedly asked for Rs 50,000 to release the body pic.twitter.com/rezk7p6FyG
— ANI (@ANI) June 8, 2022
ఇదీ జరిగింది
समस्तीपुर- जवान बेटे का पोस्टमार्टम के लिए माता पिता कर रहा है भिक्षाटन,पोस्टमार्टम कर्मी ने कहा 50 हज़ार लाओ और बेटे का शव ले जाओ।
— Mukesh singh (@Mukesh_Journo) June 8, 2022
यहां जीना भी मुश्किल और मरना भी मुश्किल।#बिहार pic.twitter.com/SZew1K1rwL
బిహార్ సమస్తీపుర్‌లో ఉన్న సర్దార్ ఆసుపత్రి నుంచి ఆ తండ్రికి కాల్ వచ్చింది. మీ కుమారుడు చనిపోయాడు వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లండి అని ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన కొడుకు.. చనిపోయాడని తెలిసి ఆదరాబాదరాగా ఆసుపత్రికి వెళ్లారు ఆ తల్లిదండ్రులు. తీరా ఆసుపత్రికి వెళ్లాక తన కుమారుడి మృతదేహం ఇవ్వాలంటే రూ.50వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఆసుపత్రిలో పని చేసే ఓ ఉద్యోగి.
అంత డబ్బు ఇవ్వడానికి తమ దగ్గర డబ్బులు లేవని ప్రాధేయపడినా వినలేదట. దీంతో డబ్బులు ఇవ్వడానికి మృతుడి తల్లిదండ్రులు యాచకులుగా మారారు. వీరు భిక్షాటన చేస్తోన్న వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సర్కార్ సీరియస్
ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ ఆసుపత్రి ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఆ తల్లిదండ్రులకు కుమారుడి మృతదేహాన్ని కూడా అప్పగిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Prophet Comment Row: నుపుర్ శర్మ, నవీన్ జిందాల్, ఓవైసీపై దిల్లీ పోలీసుల కేసు
Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ కీలక ప్రకటన