Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల- జులై 18న పోలింగ్
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జులై 18న పోలింగ్ జరగనుంది.
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ నెల 15న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 18న పోలింగ్ జరగనుంది. జులై 21న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Voting for Presidential elections to be held on 18th July, counting of votes on 21st July: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/bTvawdiE9I
— ANI (@ANI) June 9, 2022
2017 జులై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై 24తో రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
కీలక తేదీలు
- ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15
- నామినేషన్లకు చివరి రోజు: జూన్ 29
- నామినేషన్ల పరిశీలన: జూన్ 30
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 2
- పోలింగ్: జులై 18
- కౌంటింగ్, ఫలితాలు: జులై 21
- ప్రమాణస్వీకారం: జులై 25
ఎన్నిక ఇలా
Presidential poll | The value of the vote of an MP will be 700. Those in preventive detention can vote and those in jail will have to apply for parole and if they get parole, they can vote: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/NvjrGFLO1c
— ANI (@ANI) June 9, 2022
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోనుంది. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఎలక్టోరల్ కాలేజ్‌లో 4809 మంది సభ్యులు ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇందులో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 అని కమిషనర్ వెల్లడించారు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల విలువ 10,98,903గా పేర్కొన్నారు. 5,34, 680 ఓట్ల విలువ పొందిన అభ్యర్థి విజయం సాధిస్తారని ఈసీ తెలిపింది.
Also Read: Bihar News: కుమారుడి శవం ఇచ్చేందుకు లంచం డిమాండ్- డబ్బుల్లేక తండ్రి భిక్షాటన!
Also Read: Prophet Comment Row: నుపుర్ శర్మ, నవీన్ జిందాల్, ఓవైసీపై దిల్లీ పోలీసుల కేసు