Prophet Comment Row: నుపుర్ శర్మ, నవీన్ జిందాల్, ఓవైసీపై దిల్లీ పోలీసుల కేసు
Prophet Comment Row: విద్వేషపూరిత వ్యాఖ్యలపై నుపుర్ శర్మ, అసదుద్దీన్ ఓవైసీ సహా పలువురిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Prophet Comment Row: భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబా నఖ్వీ సహా మరికొందరిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత సందేశాలకు సంబంధించి వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ గ్రూపులను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే పరిస్థితులను సృష్టిస్తున్నారనే ఆరోపణలతో మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు చెప్పారు.
వీరిపై
జర్నలిస్టు సబా నఖ్వీ, హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే, రాజస్థాన్‌కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్వేష వ్యాఖ్యలపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఇతర సోషల్ మీడియా వినియోగదారులపై ఇదే విధమైన సెక్షన్ల కింద రెండవ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజాగా
AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda's name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8
— ANI (@ANI) June 9, 2022
The sections of the cases are 153, 295, 505 IPC. One case has been registered against Nupur Sharma & others one has been registered against multiple social media entities based on the analysis. Notices will be sent to the social media intermediaries for the details: Delhi Police
— ANI (@ANI) June 9, 2022
విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఓవైసీతో పాటు స్వామి యతి నరసింహానందపై కూడా కేసు నమోదు చేశారు.
Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ కీలక ప్రకటన
Also Read: Covid Update: కరోనా ఫోర్త్ వేవ్ డేంజర్ బెల్స్- భారీగా పెరిగిన వైరస్ కేసులు