అన్వేషించండి

Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఎంపీడీవోపై దాడి కలకలం రేపింది. ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని గాలివీడు ఎంపీడీవోపై వైసీపీ నేత అతని అనుచరులు దాడికి తెగబడ్డారు.

Ysrcp Leader Attack On MPDO In Annamayya District: అన్నమయ్య జిల్లాలో (Annamayya District) వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, అతని అనుచరులు శుక్రవారం దాడికి తెగబడ్డారు. ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఈ ఉదయం దాదాపు 20 మంది అనుచరులతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడగ్గా.. ఎంపీపీకి మాత్రమే తాళాలు ఇస్తానని ఎంపీడీవో తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు.. 'మాకే ఎదురు చెబుతావా' అంటూ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. కుర్చీలో నుంచి కింద పడిపోయినా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన ఎంపీడీవోను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అధికారిపై దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

ఎంపీడీవో కన్నీటి పర్యంతం

తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని.. ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఎంపీడీవో జవహర్‌బాబు కోరారు. తనపై దాడి జరిగిన తీరును మీడియాకు వివరిస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. 'గది తాళాలు ఇవ్వనందుకే వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి, అతని 20 మంది అనుచరులు నన్ను విచక్షణారహితంగా కొట్టారు. అడ్డుకున్న నా మేనల్లుడిపై కూడా దాడి చేశారు. దాడి తర్వాత అరగంట పాటు కార్యాలయంలోనే ఉన్నాను. ఇవాళ రాత్రిలోగా నన్ను చంపేస్తానని సుదర్శన్ రెడ్డి బెదిరించాడు. అతను చాలా సందర్భాల్లో అనుచరులతో వచ్చి ఎంపీపీ గదిలో మద్యం సేవించేవారు. ఇవాళ ఉదయం గది తాళాలు ఇవ్వలేదని మూకుమ్మడిగా నాపై దాడి చేశారు.' అని తెలిపారు.

Also Read: Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Meerpet Knife Attack: మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
Nagole Missing Boys: అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Embed widget