వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలి: సీఎం నితీశ్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం సమధాన్ యాత్ర సందర్భంగా బక్సర్ చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక హోదాపై మాట్లాడారు.
సమధాన్ యాత్రలో భాగంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బక్సర్ చేరుకున్నారు. అక్కడ ఆయన మరోసారి బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదాన్ని లేవనెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడంపై ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం హోదా ఇవ్వాలన్నారు. గతంలో అనేక వెనుకబడిన రాష్ట్రాలకు హోదా ఇచ్చారని గుర్తు చేశారు.
బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి
బిహార్ ఊహించని ప్రగతిని సాధించిందని నితీష్ కుమార్ అన్నారు. తమ చిరకాల డిమాండ్ ప్రత్యేక హోదా తిరస్కరణకు గురైన తర్వాత కూడా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉన్న వనరులతోనే అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. వెనుకబడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇచ్చే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాల పురోగతి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. సుశీల్ మోడీ పేరు ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రధాని మోదీ సంపన్న రాష్ట్రం నుంచి వచ్చినందున పేద రాష్ట్రాల పట్ల వివపక్ష ఉండకూదన్నారు.
తెలంగాణ సీఎం మీటింగ్‌పై నితీశ్ స్పందన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశంపై స్పందించేందుకు నితీశ్ నిరాకరించారు. బీజేపీని ఎదిరించడమే కాకుండా కాంగ్రెస్ ను ఎదగకుండా చేసే ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఈ భేటీని చూస్తున్నట్టు నితీష్ సన్నిహితులు చెబుతున్నారు. సుధాకర్ సింగ్ పై ఆర్జేడీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నితీశ్ కుమార్ భిన్నంగా స్పందించారు. నితీశ్ చిరునవ్వు నవ్వి మీకు అన్నీ తెలుసని అన్నారు. ఆయనపై పదేపదే మహాకూటమికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. అందుకే ఆయనకు ఆర్జేడీ నోటీసులు ఇచ్చింది.
‘समाधान यात्रा’ के क्रम में बक्सर में विभिन्न विभागों द्वारा चलाए जा रहे विकास कार्यों की प्रगति की समीक्षा बैठक की। बैठक में जनप्रतिनिधियों द्वारा भी अपने-अपने क्षेत्र की समस्याएं रखी गईं जिनके यथाशीघ्र समाधान हेतु अधिकारियों को निर्देश दिए। pic.twitter.com/zYmGA4rr95
— Nitish Kumar (@NitishKumar) January 18, 2023