అన్వేషించండి

S-400 Defence System : భారత్ ఆర్మీలో సుదర్శన చక్రం S-400, ఈ రక్షణ వ్యవస్థ గురించి పూర్తి వివరాలు ఇవే !

S-400 Defence System :భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాకిస్థాన్ మన స్థావరాలపై దాడికి విఫలయత్నం చేసింది. కానీ వారి ఆటలు సాగలేదు. పాకిస్థాన్ కుట్రదాడులకు S-400 అడ్డంగా నిలబడింది. 

 S-400 Defence System :ఉగ్రమూకల భరతపట్టిన భారత్‌పై పాకిస్థాన్ రగిలిపోతోంది. అవసరం ఉన్నప్పుడు ఉగ్రకుక్కల్ని ఉసిగొల్పి పబ్బం గడుపుకోవడం పాకిస్థాన్‌కు అలావాటుగా మారింది. ఆ దేశం తమ సైన్యం కంటే ఎక్కువగా ఉగ్రవాదులనే నమ్ముకుంటోంది. అందుకే వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్‌పై కక్ష పెంచుకుంది. సుందరమైన ప్రదేశాలు చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై ఏప్రిల్ 22న కాల్పులు జరిపారు. 26 మంది పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతిగానే భారత్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో పేట్రేగిపోయిన పాకిస్థాన్ భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తోంది. 

భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు అర్థరాత్రి వేళ క్షిపణి దాడులకు యత్నించింది. కానీ పాక్ కుట్రలను ముందే తెలుసుకున్న భారత్ ఆర్మీ అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టింది. ఇలాంటి పన్నాగాలు చేస్తుందన గ్రహించి అన్ని రక్షణ వ్యవస్థలను అలర్టే చేసింది భారత సైన్యం. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడానికి భారత వైమానిక దళంలోని S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ చాలా అక్కరకు వచ్చింది. మొన్న, నిన్న రాత్రి జరిగిన దాడులను సమర్థంగా ఎదుర్కోగలిగింది. పాకిస్థాన్‌కు భయాన్ని పరిచయం చేసింది.  

పాకిస్తాన్‌లోని నాలుగు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఐదు ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అందుకే భారతదేశంపై పాకిస్తాన్ సైనిక చర్యకు విఫలయత్నం చేసింది. ఆ దాడులను అడ్డుకోవడానికి భారత్‌ ఉపయోగించే S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైంది. అత్యంత ప్రాణాంతకమైన ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు లేదా SAMలలో అడ్డుకునే శక్తి దీనికి ఉంది.  

S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. 2014లో S-400 క్షిపణి వ్యవస్థను మొదటి చైనా కొనుగోలు చేసింది. S-400లో మూడు భాగాలు ఉంటాయి. క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్. ఇది విమానం, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా కదిలే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలదు. అటాక్ చేయగలదు. 
S-400 సుదూర శ్రేణి సామర్థ్యాల కారణంగా NATO సభ్యులు దీనిని ఒక పెద్ద ముప్పుగా చెబుతారు. S-400 దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఎదుర్కొంటుంది. దీని రాడార్ 600 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అక్టోబర్ 2018లో భారతదేశం S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లు కొనుగోలు రష్యాతో ఒప్పందం చేసుకుంది. దీని ఖరీదు $5 బిలియన్లు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget