అన్వేషించండి

India-Pakistan Tensions: రాత్రి ఏడు గంటల తర్వాత సరిహద్దుల్లో ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇవే

India-Pakistan Tensions: గురువారం నాడు భారత్‌, పాకిస్తాన్ మధ్య కొత్త ఘర్షణలు ప్రారంభమయ్యాయి. డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌లు జరిగాయి.

India-Pakistan Tensions: గురువారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడితో పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. దీనికి స్పందించిన భారత్ భారతదేశం ఆపరేషన్ సిందూర్ ఎంపిక చేసిన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్టు ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటలకు పొరుగు దేశం నుంచి డ్రోన్ దాడుల జరిగాయి. దీనిపై సరిహద్దు రాష్ట్రాల నుంచి నివేదికలతో పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

మే 7-8 తేదీల్లో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 15 ప్రదేశాల్లో ఇలాంటి బెదిరింపులను అడ్డుకున్న తర్వాత, జమ్మూ, పఠాన్‌కోట్‌లలోని డ్రోన్‌లు, క్షిపణులతో సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది. గురువారం సాయంత్రం మళ్లీ అలాంటి కుటింల యత్నానికి పాల్పడింది. నియంత్రణ రేఖ (LOC), జమ్మూ, కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ దళాలు కాల్పులకు తెగపడ్డాయి. ఉదయం పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. వాటిని న్యూట్రలైజ్ చేసింది.  

గురువారం సాయంత్రం ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం, జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని ఎలాంటి నష్టం వాటిల్లలేదని #IndianArmedForces ప్రకటించింది.  

క్షిపణి దాడిని అడ్డుకున్న భారత్‌  
గురువారం సాయంత్రం జమ్మూలోని కీలక ప్రదేశాల వైపు పాకిస్తాన్ ప్రయోగించిన కనీసం ఎనిమిది క్షిపణులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. టార్గెట్ చేసిన లక్ష్యాల్లో వ్యూహాత్మకంగా ముఖ్యమైన జమ్మూ సత్వారీ విమానాశ్రయం, సాంబా, RS పురా, ఆర్నియా ఉన్నాయి.

కాస్త విరామం తర్వాత జమ్మూలో రెండు పెద్ద పేలుళ్లు వినిపించాయి. ఆ తర్వాత నగరం అకస్మాత్తుగా బ్లాక్‌అవుట్‌ అయింది. డ్రోన్‌లను గాలిలో అడ్డగించడం వల్ల పేలుళ్లు జరిగి ఉండొచ్చు. భద్రతా సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నందున ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైరన్‌లు వెంటనే అప్రమత్తం చేశాయి.

రెడ్ అలర్ట్‌లో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలు
పేలుళ్లు, పదేపదే సైరన్‌ల నివేదికల తర్వాత రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసి అనేక ప్రాంతాలలో బ్లాక్‌అవుట్‌లను అమలు చేశాయి.
జైసల్మేర్‌లో దాదాపు గంటసేపు భారీ పేలుడు సంభవించి, అడపాదడపా పేలుళ్లు జరిగాయి. జిల్లా అంధకారంలో ఉంది. బాడ్మేడ్‌ రైల్వే స్టేషన్, ప్రధాన మార్కెట్, జిల్లా కలెక్టరేట్‌తో సహా కీలక ప్రదేశాల్లో ఐదు వేర్వేరు సమయాల్లో సైరన్‌లు మోగాయి.

శ్రీగంగానగర్‌లో అధికారులు ప్రజలు ఇంటి లోపలే ఉండి లైట్లు ఆపివేయాలని కోరారు. పెరుగుతున్న ప్రజా ఆందోళన కారణంగా పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.

బికనీర్‌లో పూర్తి బ్లాక్‌అవుట్‌ను అమలు చేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జిల్లా మేజిస్ట్రేట్ నమ్రతా వృష్ణి ఆదేశాలు జారీ చేశారు. జోధ్‌పూర్‌లో, జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ అగర్వాల్ తక్షణం పాటించాలని ఇదే విధమైన ఆదేశాన్ని జారీ చేశారు.

జైసల్మేర్ నగరంలో కూడా పేలుడు శబ్దాలు, సైరన్‌లు వినిపించాయి. అవి జైసల్మేర్-పోఖ్రాన్ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించినవని తెలుస్తోంది.  

లాహోర్‌పై డ్రోన్ దాడిని చేసిన భారత్‌- పాకిస్తాన్ నగరాల్లో సైరన్‌లు

సరిహద్దుల్లో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా భారతదేశం గురువారం సాయంత్రం లాహోర్‌పై డ్రోన్ దాడిని ప్రారంభించింది. ఈ దాడి తర్వాత, ఇస్లామాబాద్, కరాచీ, బహవల్‌పూర్‌తో సహా అనేక పాకిస్తాన్ నగరాల్లో సైరన్‌లు మోగాయని నివేదికలు వస్తున్నాయి. ఇది ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. పాకిస్తాన్ వైమానిక దళం AWACS (వైమానిక హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ) విమానాన్ని భారత్ కూల్చివేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.

కరాచీ ఓడరేవు సమీపంలో పేలుళ్లు 
ఉగ్రదాడుల నేపథ్యంలో కరాచీ ఓడరేవు ప్రాంతం సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. దీంతో భారత నావికాదళం అలర్ట్ అయింది. అరేబియా సముద్రంలో కీలకమైన అస్త్రాలను రెడీ చేసింది. కార్యాచరణ సంసిద్ధతను కొనసాగించడానికి పశ్చిమ నావికాదళం INS విక్రాంత్, డిస్ట్రాయర్లను మోహరించిందని తెలుస్తోంది. 

భారతదేశ క్షిపణి రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్‌కు చెందిన ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Rahul Gandhi in Germany: జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Embed widget