India Pakistan Attack News Live: సరిహద్దుల్లో మళ్లీ పాకిస్థాన్ కాల్పులు - దీటుగా జవాబు ఇస్తున్న భారత్- జమ్మూ, అమృత్‌సర్, పఠాన్‌కోట్‌లో బ్లాక్‌అవుట్
Operation Sindoor 2.0: రెచ్చగొట్టి వేడుక చూద్దామని అనుకున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టిగానే బుద్ది చెబుతోంది. వద్దంటున్నా సైనిక స్థావరాలపై దాడులు చేయడంతో భారత్ కాన్సెంట్రేషన్ చేసింది.

Background
Operation Sindoor 2.0: అసలే కుంటుతూ నడుస్తున్న సంగతి మర్చిపోయి భారత్‌తో పెట్టుకుంది పాకిస్థాన్. అనవసరంగా రెచ్చగొట్టినందుకు ఇప్పుడు ఉగ్రరాజ్యం మూల్యం చెల్లించుకుంటోంది. భారత్‌తో పోరులో తమకు అనేక దేశాలు కలిసి వస్తాయని భ్రమించి భారత్‌ను రెచ్చికొట్టింది. ఇప్పుడు భారత్ ఎదురుదాడి చేసేసరికి ఒంటరిగా పరుగులు పెడుతోంది. భారత్ సహనాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది.
ఏ దేశమైన సైన్యం అండతో పాలిస్తుంది. పాకిస్థాన్‌కు ఆ తెలివి ఎప్పుడో పోయింది. సైన్యాన్ని నమ్ముకుంటే ఎక్కడ వెన్నుపోటు పొడుస్తుందో అన్న భయంతో ఉగ్రమూకలను నమ్ముకుందీ. ఇప్పుడు అదే ఆ దేశం కొంప ముంచుతోంది. ప్రపంచ దేశాల్లో ఒంటిరైంది. సాయం చేసేందుకు చుట్టుపక్కల ఉన్న ఒక్క దేశం కూడా రావడం లేదు. చివరకు పెద్దన్న పెద్దన్న అంటూ చంకనెక్కి తిరిగిన చైనా కూడా హ్యాండ్ ఇచ్చింది. ఆ దేశం అమ్మిన ఆయుధాలు, ఇతర రక్షణ వ్యవస్థ కూడా కుప్పకూలింది. వాటి వల్ల పాకిస్థాన్‌కు కోట్ల నష్టం వాటిల్లిందే తప్ప కాపాడలేకపోయింది.
India Pakistan Attack News Live: పూంచ్‌లో మళ్లీ కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్
India Pakistan Attack News Live: పూంచ్‌లో పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు ప్రారంభించింది. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం చెబుతోంది. జమ్మూలోని అనేక చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
India Pakistan Attack News Live: అఖ్నూర్‌లో పూర్తిగా విద్యుత్తు సరఫరా నిలిపివేత
India Pakistan Attack News Live:జమ్మూ డివిజన్‌లోని అఖ్నూర్‌లో పూర్తి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. సైరన్‌ల శబ్దాలు వినిపిస్తున్నాయి.





















