operation sindoor: పారిపోయిన సైన్యాధిపతిని తీసేసిన పాక్ - కొత్త చీఫ్‌గా సాహిర్ షంషాద్ మీర్జా నియామకం
operation sindoor: భారత్‌తో పోరడటానికి ఆయుధాలు లేవు, ప్రజల సహకారం లేదు. కనీసం సైన్యానికి దిశానిర్దేశం చేసే సైన్యాధిపతి కూడా లేడు.

operation sindoor:: భారత్‌ను రెచ్చిగొట్టి వదిలేసిన పాకిస్థాన్ సైన్యాధిపతి మున్నీర్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్టు సమాచారం. అసలు పోరాటానికి ముందే పారిపోయిన అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. సైన్యానికి నిర్దేశం చేసే వ్యక్తి లేడు. ప్రధాని విదేశాలకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్‌గా సాహిర్ షంషాద్ మీర్జా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాకిస్థాన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ ఎదురు దాడితో దిక్కుతోచని స్థితిలో నిల్చుంది దాయాది దేశం. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఉగ్రదేశానికి సాయం చేయడం లేదు. అణుబాంబులేస్తాం... అంతం చేస్తామంటూ గొప్పలకు పోయిన పాకిస్థాన్ ఇప్పుడు పలాయనం చిత్తగిస్తోంది. భారత్ కరెక్ట్‌గా అరగంట కాన్సెంట్రేషన్ చేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
భారత్‌తో పోరడటానికి ఆయుధాలు లేవు, ప్రజల సహకారం లేదు. కనీసం సైన్యానికి దిశానిర్దేశం చేసే సైన్యాధిపతి కూడా లేదు. ఇప్పుడు ఆ దేశ ప్రధాని కూడా విదేశాలకు పారిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
భారత్‌పైకి ఉగ్రమూకలను రెచ్చగొట్టి వేడుక చూద్దామని అనుకున్న పాకిస్థాన్ సైన్యాధిపతి మున్నీర్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. భారత్‌లో ఉగ్రదాడి జరిగిన మరునాటి నుంచే అతను విదేశాలకు పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయ. ఆయన ఉన్నాడని ఉత్తుత్తి ప్రకటనలు ఇస్తూ వస్తున్న పాకిస్థాన్ ... ప్రాణాల మీదకు వచ్చేసరికి అసలు విషయం చెప్పింది. మున్నీర్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.





















