సెల్ఫీ తీసుకున్న ఆదిత్య, భూమి చంద్రుడి ఫొటోలు కూడా తీసిందని ఇస్రో ట్వీట్
Aditya-L1 Mission: ఆదిత్య L1 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది ఇస్రో.
Aditya-L1 Mission:
ఆదిత్య సెల్ఫీ
ఆదిత్య L1 మిషన్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది ఇస్రో. సూర్యుడి L1 పాయింట్ దిశగా ప్రయాణిస్తున్న ఆదిత్య...భూమి, చంద్రుడి మధ్యలోకి వచ్చిన సమయంలో ఓ సెల్ఫీ తీసుకుంది. ఇదే విషయాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 4న ఈ ఫొటోలు తీసినట్టు వెల్లడించింది. సెల్ఫీతో పాటుగా భూమి, చంద్రుడి ఫొటోలనూ పంపింది. ఈ ఫొటోలో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC)తో పాటు సోలార్ ఆల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) కూడా కనిపించింది. ఈ ఫొటోలతో కూడిన వీడియోని ఇస్రో ట్విటర్లో పోస్ట్ చేసింది.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 7, 2023
👀Onlooker!
Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy
L1కి చేరుకున్నాక..?
ఒక్కసారి L1 ఫేజ్‌కి చేరుకున్న తరవాత ఆదిత్య L1 ఇంజిన్ల సాయంతో పాథ్ మార్చుతారు. అక్కడి నుంచి క్రమంగా L1 Halo Orbitలోకి ప్రవేశిస్తుంది. ఆ పాయింట్ వద్దే ఇది స్టేబుల్‌గా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ వద్ద భూమి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవడం వల్ల ఆదిత్య L1 అక్కడే స్థిరంగా ఉంటుంది. అయితే...సైంటిస్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...అది అక్కడ స్టేబుల్‌గా ఉండకుండా చాలా నెమ్మదిగా కదులుతుంది. అక్కడి నుంచే సూర్యుడికి సంబంధించిన కీలక వివరాలు సేకరిస్తుంది. రోజుకి 14 వందలకు పైగా ఫొటోలు తీసి పంపుతుంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 3 సక్సెస్‌తో జోష్ మీదున్న ఇస్రో...ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందన్న ధీమాతో ఉంది.
టార్గెట్ ఇదే..
సూర్యుడి ఉపరితలంపై విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. 2.7 కోట్ల డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందని అంచనా. ప్లాస్మా ఎక్ల్ప్లోజన్ ( plasma explosion) వల్ల ఉపరితలం నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఈ పేలుడు కారణణంగానే...స్పేస్‌లోకి మిలియన్ టన్నుల ప్లాస్మా వ్యాప్తి చెందుతుంది. దీన్నే టెక్నికల్‌గా Coronal Mass Ejection (CME)గా పిలుస్తారు. కాంతివేగంతో సమానంగా ఈ ప్లాస్మా అంతరిక్షంలోకి విస్తరిస్తుంది. ఒక్కోసారి ఈ CME భూమి దిశగానూ దూసుకొస్తుంది. కాకపోతే..భూమికున్న గురుత్వాకర్షణ శక్తి వల్ల అది భూమిని తాకేందుకు వీలుండదు. కొన్ని సార్లు భూమి Outer Layerలోకి చొచ్చుకుని వచ్చింది. ఎప్పుడైతే CME భూమివైపు దూసుకొస్తుందో...భూ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలకు డ్యామేజ్ జరుగుతుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికే ఇస్రో ఆదిత్య L1 మిషన్‌ని చేపట్టింది. దాని తీవ్రతను అంచనా వేయడానికి ఈ ప్రయోగం ఉపకరించనుంది. భూమికి అతి దగ్గర్లో ఉన్న నక్షత్రం సూర్యుడు. నక్షత్రాలపై అధ్యయనం చేయాలంటే..సూర్యుడే బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అందుకే...సూర్యుడిపైనే గురి పెట్టింది ఇస్రో.
Also Read: భారత్ అన్ని దేశాలనూ కలిపే వారధి లాంటిది, ABP న్యూస్‌తో G20 చీఫ్ కోర్డినేటర్ శ్రింగ్లా