ఏబీపీ నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 : జీవిత సత్యాలు చెప్పనున్న జావెద్ అక్తర్ !
ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత, పద్మభూషణ్ జావెద్ అక్తర్ జీవితంలో మంచి, చెడూలను విశ్లేషించనున్నారు.
ABP Network Ideas of India Summit 2023: రాబోయే కాలంలో భారదదేశం గ్లోబల్ లీడర్‌గా ఉండాలంటే అది ఆర్థికంగా బలపడటం ద్వారానే మాత్రం సాధ్యం కాదు. ఆర్థికంగా బలపడాలంటే ముందుగా దేశ ప్రజలు మానసికంగా కూడా ధృడంగా ఉండాలి. అప్పుడే దేశ గతిని మార్చేవారు పుట్టుకువస్తారు. ఇలా రావాలి అంటే.. మన దేశంలో దిగ్గజ వ్యక్తుల జీవితాల నుంచి ప్రేరణ పొందాలి. అలాంటి దిగ్గజాలు అనుభవనాలను ABP నెట్‌వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్' వేదికగా పంచుకోనున్నారు. 'లెర్నింగ్ ఫ్రమ్ ఎ లెజెండ్: లెసన్స్, గుడ్ అండ్ బ్యాడ్' అనే సెషన్‌లో బాలీవుడ్ లెజెండరీ గేయ రచయిత జావెద్ అక్తర్ అక్తర్ తన వృత్తి జీవితం, జీవిత అనుభవాలు గురించి పంచుకుంటారు.
జావేద్ అక్తర్ ఐదు జాతీయ చలనచిత్ర అవార్డుల గ్రహీత. 1999లో పద్మశ్రీ , 2007లో పద్మభూషణ్ అందుకున్నారు. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తో అక్తర్ సాన్నిహిత్యం హిందీ చలనచిత్ర రంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది. వీరు ఇద్దరూ కలిసి ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందించారు. జావేద్ అక్తర్ , సలీం ఖాన్ కాంబినేషన్‌లో'దీవార్', 'షోలే' వంటి చిత్రాలకు రచనలు చేశారు. సెల్యులాయిడ్‌పై విలన్ క్యారెక్టర్‌కు ప్రత్యేక జనాదరణ తీసుకురావడం వీరి నుంచే ప్రారంభమయింది. జావేద్ అక్తర్ దేశ సమస్యలపై ఎన్నో సార్లు గొంతెత్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) కోసం ప్రచారం చేయడం ద్వారా రాజకీయాల్లో ఒక ముద్ర వేశారు. అక్తర్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు.
ABP నెట్‌వర్క్ యొక్క 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్' ఈ సంవత్సరం 'నయా ఇండియా" సమ్మిట్ థీమ్‌తో తిరిగి వచ్చింది లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్ కాన్సెప్ట్‌తో రెండవ ఎడిషన్ ఫిబ్రవరి 24-25 మధ్య జరుగుతుంది మరియు అన్ని రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు భారతదేశ రాజకీయ స్థితి వరకు ముఖ్యమైన సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బ్రిటిష్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్, గీత రచయిత మరియు కవి జావేద్ అక్తర్, గాయకులు లక్కీ అలీ మరియు శుభా ముద్గల్, రచయితలు అమితవ్ ఘోష్ మరియు దేవదత్ పట్తానాయక్, నటీమణులు సారా అలీ ఖాన్ మరియు జీనత్ అమన్, నటులు ఆయుష్మాన్ ఖురానా మరియు మనోజ్ వాజ్‌పేయి, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, క్రీడా తారలు జ్వాలా గుప్తా మరియు వినేష్ ఫోగట్ మరియు ఇంకా చాలా మంది ప్రముఖులు తమ ఐడియాలను వెల్లడించనున్నారు. ఈ సంవత్సరం, ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ను - డాబర్ వేదిక్ టీ సమర్పిస్తోంది. డాక్టర్ ఆర్థో, గాలంట్ అడ్వాన్స్ , రాజేష్ మసాలా (మారుతి సుజుకీ మరియు టెక్ భాగస్వామి పానాసోనిక్‌తో కలిసి) సహ సమర్పణ చేస్తున్నారు.