Avatar 2 Re Release: మళ్లీ థియేటర్లలోకి విజువల్ వండర్ 'అవతార్ 2' - 3D ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేయండి... ఎప్పుడో తెలుసా?
Avatar The Way Of Water: హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ 'అవతార్ 2' మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 'అవతార్ 3' రిలీజ్‌కు ముందే మూవీ టీం బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

James Cameron's Avatar The Way Of Water Re Release Date: హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ మాస్టర్ పీస్ 'అవతార్ 2' మరోసారి థియేటర్లలోకి రానుంది. ఈ ఫ్రాంచైజీలో రాబోతోన్న 'ఫైర్ అండ్ యాష్' కోసం ఎదురు చూస్తోన్న ప్రేక్షకులకు మూవీ టీం ముందే బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఎప్పుడు రీ రిలీజ్ అంటే?
ఈ ఏడాది అక్టోబర్ 2న 'అవతార్ 2' థియేటర్లలోకి రానుంది. అయితే, వారం రోజుల పాటే థియేటర్లలో ఉండనుంది. 3D ఫార్మాట్‌లో మూవీ అందుబాటులోకి రానుంది. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మళ్లీ 3Dలో చూడటం ద్వారా, పాండోరా అద్భుతమైన అండర్ వాటర్ లోకాలు, సల్లీ ఫ్యామిలీ హృదయానికి హత్తుకునే కథను పెద్ద తెరపై మళ్లీ ఎక్స్‌పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంది.
ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ మొదటిసారి 2022 డిసెంబర్‌లో విడుదలై, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది. 'ఈ అవకాశం మిస్ అవ్వకండి. మీరు ముందే ఈ మంత్ర ముగ్ధమైన లోకాన్ని చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా – ఇది మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.' అని '20th Century Studios' ఇండియా ప్రతినిధులు తెలిపారు.
Avatar: The Way of the Water is back on the big screen starting October 3rd for one week only. Experience it in 3D. pic.twitter.com/s4q1y4Evt9
— 20th Century Studios (@20thcentury) September 3, 2025
Also Read: 'ఓజీ'తో రికార్డుల వేట మొదలు... పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ - అమెరికాలో వసూళ్ల విధ్వంసం
ఈ మూవీలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, సిగర్నీ వీవర్, కేట్ విన్ స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ పార్ట్‌లో పండోరా అందాలను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన కామెరూన్... 'అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్'లో నీటి అడుగున భారీ జలచరాలు, అందాలను అద్భుతంగా చూపించారు. 2022లో రిలీజ్ అయిన సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు వసూళ్లు సాధించింది.
స్టోరీ ఏంటంటే?
భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ (సామ్ వర్తింగ్టన్) అక్కడే ఓ తెగకి చెందిన నేతిరి (జో సల్దానా)ను ప్రేమ వివాహం చేసుకుంటాడు. నేతిరి తండ్రి వారసత్వంతో ఆ తెగకు నాయకుడై నడిపిస్తుంటాడు. జేక్ దంపతులకు లోక్, నేటియం, టూక్ ముగ్గురు పిల్లలు. వీరు కిరీ, స్పైడర్ అనే మరో ఇద్దరినీ కూడా దత్తత తీసుకుంటారు. మరోవైపు భూమి అంతం అయిపోతుందని పండోరాలో తెగను అంతం చేసి ఆక్రమించుకోవాలని చూస్తుంటారు మనుషులు.
దీంతో జేక్ కుటుంబంతో సహా మెట్కయినా ప్రాంతానికి చేరుకుంటాడు. సముద్రమే తమ జీవితాలుగా బతికే ఆ ప్రాంతానికి రాజు టోనోవరి. అతని సహకారంతో జేక్ అక్కడి వారితో అనుబంధం పెంచుకుంటాడు. వారితో కలిసి తమను అంతం చేయడానికి వచ్చిన శత్రువు మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్)తో ఎలా పోరాటం చేశారనేదే ఈ కథ.





















