Madharaasi vs Ghaati: శివకార్తికేయన్ 'మదరాసి' వర్సెస్ అనుష్క 'ఘాటీ'... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్?
Madharaasi Vs Ghaati Pre Release Business: శివకార్తికేయన్ - మురుగదాస్‌ల 'మదరాసి', అనుష్క - క్రిష్ జాగర్లమూడిల 'ఘాటీ' విడుదల ఒకే రోజు. థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఎవరిది అప్పర్ హ్యాండ్?

సెప్టెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో ముఖ్యమైనవి రెండు ఉన్నారు. ఒకటి... శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'మదరాసి'. రెండు... అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన 'ఘాటీ'. ఈ రెండు సినిమాలకూ తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉంది. మరి, ఎవరి సినిమా ఎంత బిజినెస్ చేసింది. మార్కెట్టులో ఎవరిది అప్పర్ హ్యాండ్? అనేది ఒక్కసారి తెలుసుకోండి.
తెలుగులో అనుష్కది అప్పర్ హ్యాండ్!
హీరోలతో సమానమైన క్రేజ్ అనుష్క సొంతం. 'బాహుబలి'తో ఆమెకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి మీద ప్రేక్షకులలో ఉన్న అభిమానం కూడా తోడు అయ్యింది. అందువల్ల, తెలుగులో అనుష్క సినిమాకు అప్పర్ హ్యాండ్ లభించింది.
తెలుగులో 'ఘాటీ' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... కొంత మంది టైర్ 2, 3 హీరోస్ ఫిలిమ్స్ కంటే బాగా చేసిందని చెప్పవచ్చు. నైజాం రైట్స్ రూ. 8 కోట్లు, ఆంధ్ర ఏరియాలు రూ. 10 కోట్లు, రాయలసీమ రైట్స్ రూ. 4 కోట్లకు ఇచ్చారని టాక్. దాంతో తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ. 22 కోట్లు అయ్యింది.
తెలుగు నిర్మాత, 'తిరుపతి ప్రసాద్'గా పాపులర్ అయినటువంటి శ్రీ లక్ష్మి పిక్చర్స్ అధినేత ఎన్వీ ప్రసాద్ 'మదరాసి' ప్రొడ్యూస్ చేశారు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వేల్యూ 10 కోట్ల కింద లెక్క కట్టారు. 'ఘాటీ'కి దగ్గర దగ్గరలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ జరగలేదు.
విదేశాల్లో రెండిటికీ బిజినెస్ బావుంది!
ప్రధాన తారాగణంతో పాటు దర్శకుల ఇమేజ్ అనేది విదేశాల్లో రెండు సినిమాలకు ప్లస్ అయ్యింది. అనుష్క శెట్టి - విక్రమ్ ప్రభు నటించిన 'ఘాటీ' రైట్స్ ఆల్మోస్ట్ రూ. 10 కోట్లకు ఇస్తే... శివకార్తికేయన్ - రుక్మిణీ వసంత్ నటించిన 'మదరాసి' రైట్స్ రూ. 11 కోట్లకు ఇచ్చారట.
తమిళంలో శివకార్తికేయన్ సినిమాకు క్రేజ్!
'మదరాసి'కి ముందు శివకార్తికేయన్ నటించిన 'అమరన్' భారీ హిట్. ఆ రిజల్ట్ ఎఫెక్ట్ మార్కెట్టులో బలంగా కనిపించింది. తమిళనాడులో సైతం ఓన్ డిస్ట్రిబ్యూషన్ వైపు ఎన్వీ ప్రసాద్ మొగ్గు చూపారు. అయితే ఆయన నేరుగా విడుదల చేయడం లేదు. మరొకరికి అడ్వాన్స్ బేసిస్ మీద ఇచ్చారు. పాతిక కోట్లు అడ్వాన్స్ తీసుకుని విడుదల చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ బిజినెస్ వేల్యూ 35 కోట్ల కింద లెక్క కట్టారట. తమిళనాడులో అనుష్క సినిమాకు అంత క్రేజ్ లేదు. అక్కడ నుంచి 10 కోట్లు మాత్రమే వచ్చినట్టు టాక్. రెస్టాఫ్ ఇండియాలో రెండు సినిమాలకు ఆల్మోస్ట్ అటు ఇటుగా బిజినెస్ జరిగింది.
Also Read: 'ఓజీ'తో రికార్డుల వేట మొదలు... పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ - అమెరికాలో వసూళ్ల విధ్వంసం
ఓవరాల్ లెక్కలు చూస్తే... వరల్డ్ వైడ్ రూ. 65 నుంచి 75 కోట్ల అమ్మకాలతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా శివకార్తికేయన్ 'మదరాసి' ఓ అడుగు ముందు ఉంది. అనుష్క సినిమా బిజినెస్ రూ. 51 కోట్లు మాత్రమే. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగానూ శివకార్తికేయన్ సినిమా ముందంజలో ఉంది.
Also Read: ఘోస్ట్ వాక్ టూర్ గైడ్ to దెయ్యం... 'కిష్కింధపురి'లో హీరోయిన్ అనుపమ రోల్ ఇదే





















