Anupama Parameswaran - Kishkindhapuri: ఘోస్ట్ వాక్ టూర్ గైడ్ to దెయ్యం... 'కిష్కింధపురి'లో హీరోయిన్ అనుపమ రోల్ ఇదే
Anupama Parameswaran Role In Kishkindhapuri: హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' ట్రైలర్ విడుదలైంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రోల్ ఏమిటి? అనేది అందులో రివీల్ అయ్యింది.

'పరదా'పై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బోలెడు ఆశలు పెట్టుకుంది. అయితే ఆ సినిమాకు విమర్శకులు కొందరి నుంచి ప్రశంసలు వచ్చాయి గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు ఏమీ రాలేదు. ఆ రిజల్ట్ పక్కన పెట్టిన అందాల భామ... కొత్త సినిమా 'కిష్కింధపురి'తో సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యింది. మరి, ఈ సినిమాలో ఆవిడ రోల్ ఏమిటో తెలుసా?
ఘోస్ట్ వాక్ టూర్ గైడ్ టు దెయ్యం!
'కిష్కింధపురి'తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడీ రిపీట్ అవుతోంది. దీనికి ముందు వాళ్లిద్దరూ 'రాక్షసుడు'లో నటించారు. ఇక లేటెస్ట్ మూవీ విషయానికి వస్తే... ఇందులో అనుపమ దెయ్యంగా కనిపించబోతున్నారు.
'కిష్కింధపురి' ట్రైలర్‌లో కథ గురించి చాలా వరకు క్లారిటీ ఇచ్చారు దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి. ఘోస్ట్ వాక్ టూర్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు హీరో హీరోయిన్లు. అంటే ఫలానా బంగ్లాలో దెయ్యం ఉందని ప్రచారం జరుగుతుంది కదా! అటువంటి ఇంటిలోకి జనాలను తీసుకు వెళ్లడం అన్నమాట. వాళ్లకు స్కెరీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం! అయితే ఓ భవనంలోకి జనాలు తీసుకు వెళ్ళాక నిజమైన దెయ్యం ఎదురు అయితే ఏమిటి? అనేది సినిమా కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది.
Also Read: 'ఓజీ'తో రికార్డుల వేట మొదలు... పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ - అమెరికాలో వసూళ్ల విధ్వంసం
అనుపమ పరమేశ్వరన్ రోల్ విషయానికి వస్తే... ఘోస్ట్ వాక్ టూర్ గైడ్ నుంచి ఘోస్ట్ కింద మారే అమ్మాయి పాత్ర అని తెలుస్తోంది. 'కిష్కింధపురి' ట్రైలర్ చూస్తే హీరో బెల్లంకొండ బాగా నటించినట్టు అర్థం అవుతోంది. కానీ హాస్పిటల్ బెడ్ మీద దెయ్యంగా అనుపమ కనిపించే సన్నివేశాలపై మాత్రం అందరి దృష్టి పడింది. మరీ ముఖ్యంగా దెయ్యంగా అనుపమ చూసే చూపు థియేటర్లలో భయపెట్టేలా ఉంది.
జ్వరంతో ప్రచారానికి వచ్చిన అనుపమ
జ్వరం ఇబ్బంది పెట్టినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ 'కిష్కింధపురి' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరు అయ్యారు. తనకు హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలిపారు. మూడు నాలుగేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి హారర్ ఫిలిమ్స్ చూసేదానిని అని, కర్లీ హెయిర్ ఉండటం వల్ల ఇంతకు ముందు కొన్ని హారర్ సినిమా ఛాన్సులు వచ్చినప్పటికీ... 'కిష్కింధపురి'తో కుదిరిందని ఆవిడ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం తనను చూసి దెయ్యంగా ఉన్నావని తల్లి అంటుందని కూడా తెలిపారు.
'కిష్కింధపురి' సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకం మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 12న థియేటర్లలోకి సినిమా రానుంది. 'మిరాయ్' రిలీజ్ కూడా ఆ రోజే. రెండు సినిమాలకు మంచి హైప్ ఉంది. 'మిరాయ్' పాన్ ఇండియా ఫిల్మ్ అయితే 'కిష్కింధపురి' తెలుగులో విడుదల అవుతోంది.





















