Trump Modi Phone Call USA Tariffs | భారత్ పై అమెరికా 50 శాతం టారిఫ్ లు అందుకే | ABP Desam
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు టారిఫ్‌ల మోత మోగించడానికి (US Tarrifs on India) కారణం ఏంటన్న దానిపై కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. జూన్ 17న అమెరికా అధ్యక్షుడు భారత ప్రధానిక మోదీకి చేసిన ఓ ఫోన్‌కాల్, దాని పర్యవసనాల వల్లే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని Newyork Times పేర్కొంది. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇండియా ఎక్కువ సుంకాలు విధిస్తోందని.. ఇండియా టారిఫ్‌లు తగ్గించుకోవాలంటూ అంతకు మందు వరకూ ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇండియా సుంకాల తగ్గించకోపోతే మేము కూడా టారిఫ్‌లు పెంచుతామని హెచ్చరించారు. ఒక్క భారత్ విషయంలోనే కాదు చాలా దేశాలకు ట్రంఫ్ అలాగే బెదిరింపులు చేశారు. ఆ క్రమంలోనే భారత్‌కు టారిఫ్‌లు పెంచారు అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఇండియాపై అమాంతం టాక్స్‌లు వేసేశాడు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్… కొన్ని రోజుల్లోనే దిగుమతి సుంకాలను 50శాతం చేసేశాడు. అయితే ట్రంప్ అంతటి తెంపరి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒక్క ఫోన్‌కాల్. అమెరికాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్





















