My Home Bhuja Laddu Action: మీకేంటి ఉన్నోళ్లు బ్రో - మైహోంభూజాలో రూ.51 లక్షలకు గణేష్ లడ్డూ వేలం !
MyHome Bhuja Ganesh Laddu: మైహోం భూజా గణేష్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో 51 లక్షలు పలికింది. గత ఏడాది కన్నారెట్టింపు పలికింది.

MyHome Bhuja Ganesh Laddu auction fetches record Rs 51 lakh: గణేశ్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని మైహోంభూజా గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన గణేశ్ లడ్డూ వేలం మరోసారి సంచలనం సృష్టించింది. గణేశ్ లడ్డూకు రూ.51,07,777 లక్షల రికార్డు ధర పలికింది. ఇల్లందుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత గణేశ్ దీన్ని దక్కించుకున్నారు. గత ఏడాదీ ఇతడే రూ.29 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. ఆ 29 లక్షల రూపాయలను అప్పుడే కట్టేశారు. బాగా కలసి వచ్చిందని ఈ సారి మరికొంత మంది పోటీ పడినా తానే రూ.51 లక్షల వరకూ వెళ్లి లడ్డూను దక్కించుకున్నారు.
గణపతి లడ్డూ ప్రసాదం ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు తెచ్చిపెడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ లడ్డూ వేలం నుండి సేకరించిన నిధులు స్థానిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు, పాఠశాలలకు, ఆరోగ్య సంరక్షణకు, ఎన్జీవోలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తామని సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు.
*రాయదుర్గం మై హోమ్ భూజా లో రికార్డు బ్రేక్ చేసిన లడ్డు వేలం పాట....*
— RK TV (@Rktvlive_) September 4, 2025
హోరా హోరీ గా సాగిన లడ్డు వేలం పాట....
*51లక్షల 7వేల 7 వందల 77 రూపాయలు పలికిన లడ్డూ....*
51,700,77 లక్షల రూపాయలకు లడ్డు ను కైవసం చేసుకున్న గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత,కమ్మం జిల్లా ఇల్లందు గ్రామ వాసి. pic.twitter.com/b1JODKNNim
ఐటీకారిడార్ లో ఉండే.. మైహోంభూజా హైదరాబాద్‌లోని ఉండే అత్యంత ఖరీదైన హౌసింగ్ సొసైటీల్లో ఒకటిగా భావిస్తారు. సెలబ్రిటీలు,ధనవంతులు, పారిశ్రామికవేత్తలు,సినీరంగానికి చెందిన వారు, రాజకీయ నేతలు ఇందులో నివాసం ఉంటారు. అందుకే వారికి డబ్బులు పెద్ద విషయం కాదని..గణేష్ లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పడతారని భావిస్తున్నారు.
ఖమ్మం ఇల్లందు వాసి, గణేష్ రియల్ ఎస్టేట్ అధినేత కొండపల్లి గణేష్ 2025 మై హోమ్ భూజా లడ్డూ వేలంలో 51,77,777 రూపాయలతో రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ వేలం ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది..
— Telangana Nestham (@TNestham) September 4, 2025
#MyHomeBhujaLaddu #RecordAuction #GaneshRealEstate #Khammam pic.twitter.com/ihKINLfmyX
మైహోంభూజా లడ్డూ వేలం హైదరాబాద్‌లోని గణేశ్ చతుర్థి ఉత్సవాలలో సంప్రదాయంగా మారింది. ఈ వేలం గత కొన్నేళ్లుగా గణనీయమైన ఆదాయాన్ని సేకరిస్తోంది. 2022లో ఈ లడ్డూ రూ.25.50 లక్షలకు వేలం వేయగా, 2024లో రూ.29 లక్షలకు చేరుకుంది. ఈ వేలం హైదరాబాద్‌లోని బాలాపూర్, ఖైరతాబాద్, బండ్లగూడ లడ్డూ వేలాలతో పోటీపడుతూ, రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గణేశ్ లడ్డూ వేలాలలో ఒకటిగా నిలిచింది.




















