Ganesh Visarjan 2025: మూడవ, 5వ, 7వ రోజు అనంత చతుర్దశి... గణేష్ నిమజ్జనం శుభ ముహూర్తం తెలుసుకోండి!
Ganesh Visarjan 2025 Date Shubh muhurat : వినాయక చవితి రోజు పూజ తర్వాత నవరాత్రులు పూజలు అందించి అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. 3, 5, 7,9 రోజులలో కూడా నిమజ్జనం చేస్తారు..

Ganesha Visarjan on Anant Chaturdashi 2025: వినాయక చవితి రోజు పూజతో గణేష్ ఉత్సవం ప్రారంభమైంది. మొదటి రోజున గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు గణపయ్యను ఘనంగా ఇంటికి తీసుకువస్తారు. ప్రతిష్టాపన చేస్తారు. 10 రోజుల పాటూ గణపతిని పూజిస్తారు, ఆరాధిస్తారు, ఆ తర్వాత అనంత చతుర్దశి రోజున విధి విధానాలతో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.
గణేష్ నిమజ్జనం సాధారణంగా అనంత చతుర్దశి రోజున జరుగుతుంది, కాని కొంతమంది నమ్మకం ప్రకారం గణపతిని ఒకటిన్నర, మూడవ, ఐదవ, ఏడవ రోజుల‌్లో కూడా నిమజ్జనం చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం ఎప్పుడు, ఏయే ముహూర్తాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఒకటిన్నర రోజుల‌్లో గణేష్ నిమజ్జనం ముహూర్తం - 28 ఆగస్టు 2025
- ప్రాతఃకాల ముహూర్తం (చర, లాభ, అమృతం) - మధ్యాహ్నం 12:22 - 03:35 PM
- అపరాహ్న ముహూర్తం (శుభ) - సాయంత్రం 05:11- సాయంత్రం 06:47
- సాయంకాల ముహూర్తం (అమృతం, చర) - సాయంత్రం 06:47- రాత్రి 09:35
- రాత్రి ముహూర్తం (లాభ) - అర్ధరాత్రి 12:22- అర్ధరాత్రి 01:46
మూడవ రోజు గణేష్ నిమజ్జనం ముహూర్తం - 29 ఆగస్టు 2025
- ప్రాతఃకాల ముహూర్తం (చర, లాభ, అమృతం) - ఉదయం 05:58- ఉదయం 10:46
- అపరాహ్న ముహూర్తం (చర) - సాయంత్రం 05:10 - సాయంత్రం 06:46
- అపరాహ్న ముహూర్తం (శుభ) - మధ్యాహ్నం 12:22 - మధ్యాహ్నం 01:58
- రాత్రి ముహూర్తం (లాభ) - రాత్రి 09:34 - రాత్రి 10:58
ఐదవ రోజు గణేష్ నిమజ్జనం ముహూర్తం - 31 ఆగస్టు 2025
- ప్రాతఃకాల ముహూర్తం (చర, లాభ, అమృతం) - ఉదయం 07:34 - మధ్యాహ్నం 12:21
- అపరాహ్న ముహూర్తం (శుభ) - మధ్యాహ్నం 01:57 - మధ్యాహ్నం 03:32
- సాయంకాల ముహూర్తం (శుభ, అమృతం, చర) - సాయంత్రం 06:44 - రాత్రి 10:57
- రాత్రి ముహూర్తం (లాభ) - అర్ధరాత్రి 01:46- అర్ధరాత్రి 03:10
ఏడవ రోజు గణేష్ నిమజ్జనం ముహూర్తం - 2 సెప్టెంబర్ 2025
- ప్రాతఃకాల ముహూర్తం (చర, లాభ, అమృతం) - ఉదయం 09:10 - మధ్యాహ్నం 01:56
- అపరాహ్న ముహూర్తం (శుభ) - మధ్యాహ్నం 03:31 - సాయంత్రం 05:06
- సాయంకాల ముహూర్తం (లాభ) - రాత్రి 08:06 - రాత్రి 09:31
- రాత్రి ముహూర్తం (శుభ, అమృతం, చర) - రాత్రి 10:56 - ఉదయం 03:10
అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనం - 6 సెప్టెంబర్ 2025
- చతుర్దశి తిథి ప్రారంభం - 6 సెప్టెంబర్ 2025, ఉదయం 3:12
- చతుర్దశి తిథి సమాప్తం - 7 సెప్టెంబర్ 2025, ఉదయం 01:41
- ప్రాతఃకాల ముహూర్తం (శుభ) - ఉదయం 07:36 - ఉదయం 09:10
- అపరాహ్న ముహూర్తం (చర, లాభ, అమృతం) - మధ్యాహ్నం 12:19 - సాయంత్రం 05:02
- సాయంకాల ముహూర్తం (లాభ) - సాయంత్రం 06:37 - రాత్రి 08:02
- రాత్రి ముహూర్తం (శుభ, అమృతం, చర) - రాత్రి 09:28 - అర్ధరాత్రి 01:45
- ఉషకాల ముహూర్తం (లాభ) - 7 సెప్టెంబర్ ఉదయం 04:36 - ఉదయం 06:02
సెప్టెంబర్ 07 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది.. అందుకే ముందురోజు కానీ ఆ తర్వాత రోజు కానీ వినాయక నిమజ్జనం చేయాలి. ఏటా అనంత చతుర్థశి రోజే నిమజ్జనోత్సవాల సందడి సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 06 శనివారం అనంత చతుర్థశి వచ్చింది. గ్రహణం ప్రభావం ఎంతమాత్రం ఉండదు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - ఈ సేవలో పాల్గొంటే మీ జన్మ ధన్యమే! తిరమలలో మొత్తం సేవల వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!






















