Pithapuram Pawan Kalyan: పిఠాపురం వాసులకు కానుకలే కానుకలు - ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పవన్- ఈ సారి టీచర్లకు !
Teachers Day gifts: పిఠాపురం నియోజకవర్గంలోని టీచర్లకు పవన్ కల్యాణ్ టీచర్స్ డే కానుక పంపించారు. గతంలోనూ ఆయన పలు వర్గాలకు ఇలాంటి కానుకలు వేలల్లో సమర్పించారు.

Pawan Kalyan sent Teachers Day gifts to teachers: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే ప్రత్యేకంగా జరిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులు , జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకులకు ఆయన కానుకలు అందజేశారు. మహిళా ఉపాధ్యాయులకు చీరలు, పురుష ఉపాధ్యాయులకు ప్యాంటు-షర్టు బహుమతులుగా ఇచ్చారు. ఈ కానుకలను పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని విద్యాశాఖ కార్యాలయాల ద్వారా ఒక ప్రత్యేక బృందం గురువారం ఉదయం పంపిణీ చేసింది. అధ్యాపకులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పిఠాపురం !!
— Sreekanth B+ve (@sreekanth324) September 4, 2025
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభం !!
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల అధ్యాపకులు – మొత్తం 2 వేల మందికి పవన్ కల్యాణ్ (లేడీస్‌కి చీరలు , జెంట్స్… pic.twitter.com/YnCAlnRCKr
పవన్ కల్యాణ్ ఇటీవల శ్రావణ మాసం సందర్భంగా.. పది వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తన పుట్టింటి ఆడపడుచుల్లాగా చీర, రూపు, పసుపు, కుంకుమ ఇచ్చారు. మనస్పూర్తిగా పూజ చేసుకున్నాం అంటూ పలువురు మహిళలు సంతోషం వ్యక్తంచేశారు.
తన పుట్టింటి ఆడపడుచుల్లాగా చీర, రూపు, పసుపు, కుంకుమ ఇచ్చారు. మనస్పూర్తిగా పూజ చేసుకున్నాం అంటూ @PawanKalyan గారికి అభినందనలు, ఆసీసులు తెలియజేసిన పిఠాపురం ఆడపడుచులు.#Pithapuram #VaralakshmiVratham pic.twitter.com/U6buL0yhl6
— JanaSena Shatagni (@JSPShatagniTeam) August 22, 2025
అంతకు ముందు రాఖీ సందర్పిభంగా ఠాపురం నియోజకవర్గం పరిధిలోని వితంతువులకు, ఒంటరి మహిళలందరికీ సోదరుడిగా నేను ఉన్నాననే భరోసా కల్పిస్తూ కానుకలు పంపించారు.
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపించిన పిఠాపురం MLA, ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
— Dr. Sandeep Panchakarla (@DrSandeepJSP) August 9, 2025
🔸పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
🔸 ఊహించని రక్షాబంధన్ కానుకకి ధన్యవాదాలు తెలిపిన ఆడపడుచులు
🔸 అధినేత బాటలో పార్టీ నాయకులు
🔸… pic.twitter.com/8MJRFrDBOG
గతంలో పిఠాపురంలో తల్లిదండ్రులు లేని వారి కోసం పవన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు తన వేతనాన్ని ఇస్తున్నారు. ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం... మిగిలిన వేతనం వారి బాగోగుల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రతి నెలా ఇంటి వద్దనే అందిస్వితున్నారు. ఉపముఖ్యమంత్రిగా వచ్చే జీతం అంతా అనాథలకే వెచ్చిస్తున్నారు .
నా జీతం... మీ జీవితం కోసం…
— JanaSena Party (@JanaSenaParty) May 9, 2025
• పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా వేతనం
• ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం... మిగిలిన వేతనం వారి బాగోగుల కోసం ఖర్చు
• ప్రతి నెలా ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు
• పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప… pic.twitter.com/Sug11tglpl





















