అన్వేషించండి

GST Reform: GST తగ్గింపు వల్ల కొత్త బైకులు కొనేవాళ్లకూ లాభమే - విడిభాగాల రేట్లు కూడా తగ్గుతాయి

GST car price cut: GST 2.0 కింద, చిన్న కార్లు & ద్విచక్ర వాహనాలపై పన్ను 18% కి తగ్గించారు. దీని వల్ల కార్ల ధరలు 12-12.5% తగ్గుతాయి. కొత్త బైకుల ధరలు కూడా దిగి వస్తాయి.

GST Cut Impact On Cars And Bikes: జీఎస్టీ కౌన్సిల్, భారదేశంలో పన్ను నిర్మాణాన్ని మార్చడం ద్వారా. పండుగ సమయంలో ప్రజలకు పెద్ద ఉపశమనం (GST Council Decisions September 2025) ఇచ్చింది. ఇకపై, వాహనాలపై రెండు పన్ను రేట్లు మాత్రమే వర్తిస్తాయి, అవి - 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్లపై & 350cc వరకు మోటార్ సైకిళ్లపై 18% జీఎస్టీ; 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు గల కార్లపై & పెద్ద SUV లపై 40% పన్ను. ద్రవ్యోల్బణం & సరైన ఆదాయం లేకపోవడం వల్ల చాలాకాలంగా వాహనాలు కొనకుండా వాయిదా వేస్తున్న చిన్న బడ్జెట్ కుటుంబాలకు ఈ మార్పు అతి పెద్ద ప్రయోజనం కల్పిస్తుంది.

చిన్న కార్ల ధర 12% వరకు తగ్గింపు
వాస్తవానికి, కొత్త పన్ను నిర్మాణంలో, 1200cc కంటే తక్కువ ఇంజిన్లు కలిగిన పెట్రోల్ కార్లు & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న 1500cc వరకు డీజిల్ కార్లు ఇప్పుడు కేవలం 18% పన్ను పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు, వీటిపై 29-31% GST వసూలు చేశారు. కొత్త మార్పు తర్వాత వాహనం ధరలు 12-12.5% వరకు తగ్గుతాయి. ఉదాహరణకు, రూ. 5 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉన్న కారుపై ఇప్పుడు దాదాపు రూ. 62,500 వరకు ఆదా అవుతుంది.

ద్విచక్ర వాహనాలు కూడా చౌక
మోటార్ సైకిల్ విభాగంలో కూడా పెద్ద మార్పు జరిగింది. 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 18% GST మాత్రమే విధిస్తారు. ఇప్పటి వరకు వాటిపై 28% పన్ను చెల్లిస్తున్నారు. ఈ నిర్ణయం, 100cc నుంచి 150cc విభాగంలో అమ్ముడయ్యే హీరో స్ల్పెండర్, హోండా షైన్ & బజాజ్ పల్సర్ వంటి పాపులర్‌ బైకులను నేరుగా ప్రభావితం చేస్తుంది.

పెద్ద వాహనాలు & ఆటో విడిభాగాలు
పెద్ద కార్లు, SUVలు & లగ్జరీ వాహనాలు కూడా చాలా కొంచెం చౌకగా మాత్రమే మారతాయి. ఇప్పుడు వాటిపై 40% పన్ను విధిస్తారు, ఇప్పటి వరకు 43-50% పన్ను విధించారు & ఇందులో సెస్ కూడా ఉంది. అలాగే, ఆటో విడిభాగాలపై 28% GSTకి బదులుగా 18% GST రేటు వర్తిస్తుంది, ఇది వాహనాల మొత్తం ధరను తగ్గిస్తుంది.

ఆటో ఇండస్ట్రీకి సరికొత్త దిశ! 
GST 2.0 రాక ఆటో పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. S&P గ్లోబల్ మొబిలిటీ అసోసియేట్ డైరెక్టర్ గౌరవ్ వంగల్ ప్రకారం, "చిన్న కార్లపై పన్నును 18%కి తగ్గించడం వల్ల పండుగ సీజన్‌లో ఎంట్రీ-లెవల్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా రెనాల్ట్ & పంచ్ వంటి కాంపాక్ట్ క్రాస్ఓవర్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ పెరుగుతుంది. మారుతి, టాటా & మహీంద్రా వంటి కంపెనీలు దీని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతాయి".

2025 ఆర్థిక సంవత్సరంలో కాంపాక్ట్ కార్లు & హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు 13% తగ్గి 1 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని పరిశ్రమ డేటా చూపిస్తోంది, అయితే SUV అమ్మకాలు 10% పెరిగి దాదాపు 23.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం ప్రయాణీకుల వాహన మార్కెట్లో చిన్న కార్ల వాటా వరుసగా ఐదవ సంవత్సరం కూడా తగ్గి 23.4%కి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చిన్న కార్ల అమ్మకాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తుందని & మార్కెట్లో సమతుల్యతను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం

వీడియోలు

Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
New scam: రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
Chennai sanitation worker: జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
Hero Splendor Plus లేదా TVS Star City Plus.. మీకు ఏ బైక్ కొనడం మంచిది? ధర, ఫీచర్లు ఇవే
Hero Splendor Plus లేదా TVS Star City Plus.. మీకు ఏ బైక్ కొనడం మంచిది? ధర, ఫీచర్లు ఇవే
Embed widget