New GST Rates For Cars: జీఎస్టీ స్లాబ్‌లు మారిన తర్వాత ఏ కార్లపై ఎంత పన్ను వేస్తారో పూర్తి లిస్ట్ ఇదే!
New GST Rates For Cars: జీఎస్టీలో మార్పులతో చిన్న కార్లు మాత్రమే కాకుండా పెద్ద కార్ల రేట్లు కూడా దిగి రానున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూడొచ్చు.

New GST Rates For Cars: జీఎస్టీ కౌన్సిల్ మండలి బుధవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబ్‌లను కుదించి రెండుకే పరిమితం చేశారు. ఇకపై ఐదు, 18 శాతం స్లాబ్‌ల ఆధారంగానే పన్నులు విధిస్తారు. కొత్త పన్ను స్లాబ్‌లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పులు కార్లు, టూ వీలర్స్‌పై ప్రభావం పడుతుంది. ప్రభుత్వం చేపట్టిన GST 2.0 సవరణ కారణంగా చిన్న కార్లతోపాటు పెద్ద వాహనాల కోసం చూస్తున్న వాళ్లకి కూడా ఉపశంన కలిగే అవకాశం ఉంది. 2017లో GST ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారిగా, అదనపు సెస్ తొలగించారు. దీని కారణంగా ప్రీమియం కార్లపై కూడా భారంతగ్గుతుంది.
ఇప్పటి వరకు ప్రీమియం పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోలుదారులు దాదాపు 50శాతం వరకు పన్ను చెల్లించే వాళ్లు. ఇందులో 28 శాతం GST , దీనికి 22% అదనపు సెస్ విధించేవాళ్లు. అంటే దాదాపు యాభై శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అదనుపు సెస్‌ను తొలగించారు.అంతే కాకుండా జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రీమియం కార్లపై కేవలం 28 శాతం జీఎస్టీ వసూలు చేసే వాళ్లు. ఇకపై 40 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఆ లెక్కన ప్రీమియం కార్లు కొనుగోలుదారులకు పది శాతం పన్ను మిగులు లభించనుంది.
జీఎస్టీ కొత్త స్లాబ్‌ల ప్రకారం ఏఏ వాహనలపై ఎంత జీఎస్టీ వేస్తారు?
| వాహనాలు | ఎనర్జీ కెపాసిటీ | పొడవు | పాత జీఎస్టీ(శాతం) | కొత్త జీఎస్టీ(శాతం) |
| మోటార్ లేని సైకిల్స్(ట్రైసైకిల్) | - | - | 12 | 5 |
| టూవీలర్స్(మోటార్ సైకిల్స్) | < 350cc | - | 28 | 18 |
| టూవీలర్స్(మోటార్ సైకిల్స్) | >350cc | - | 31 | 40 |
| త్రీ వీల్ వెహికల్స్ | - | - | 28 | 18 |
| స్మాల్ పెట్రోల్/ సీఎన్జీ/ ఎల్పీజీ కార్స్ | <=1200cc | <=4000mm | 29 | 18 |
| స్మాల్ హెచ్‌ఈవీ/పీహెచ్‌ఈవీ కార్స్ | <=1200cc | <=4000mm | 28 | 18 |
| స్మాల్ హెచ్‌ఈవీ/పీహెచ్‌ఈవీ కార్స్(డీజిల్, సెమీ డీజిల్) | <=1500cc | <=4000mm | 28 | 18 |
| స్మాల్ డీజిల్ కార్స్ | <=1500cc | <=4000mm | 31 | 18 |
| మిడ్/లార్జ్ హెచ్‌ఈవీ/పీహెచ్‌ఈవీ కార్స్ | <1200cc | <4000mm | 43 | 40 |
| మిడ్ సైజ్ కార్స్ | 1200cc టు 1500cc | <4000mm | 45 | 40 |
| మిడ్‌సైజ్/లార్జ్‌సైజ్ హెచ్‌ఈవీ/పీహెచ్‌ఈవీ కార్స్(డీజిల్, సెమీ డీజిల్) | <1500cc | <4000mm | 43 | 40 |
| లార్జ్ కార్స్ | <1500cc | <4000mm | 48 | 40 |
| ఎస్‌యవీ కార్స్(GV>170mm) | <1500cc | <4000mm | 50 | 40 |
| ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీతో ఆధారరంగా రూపొందించిన హైడ్రోజన్ వాహనాలు | - | - | 12 | 5 |
| ట్రాక్టర్స్ | >1800cc | - | 12 | 5 |
| సెమీ ట్రయలర్స్ రోడ్ ట్రాక్టర్స్ | >1800cc | 28 | 18 | |
| వస్తువులను సరఫరాచేసే మోటార్ వెహికల్స్ | >1800cc | - | 28 | 18 |
| ట్రావెలింగ్ కోసం వాడే వానాలు (10 అంతకంంటే ఎక్కువ ప్రయాణికులు) | >1800cc | - | 28 | 18 |
| అంబులెన్స్‌కు ఉపయోగించే వాహనాలు | >1800cc | - | 28 | 18 |
| పీవీకి సంబంధించి ఆటో కాంపొనెంట్స్ | - | - | 18 | |
| టూ వీలర్స్‌కు సంబంధించిన విడి భాగాలు | - | - | 28 | 18 |
| బైస్కిల్స్ అండ్ అదర్ సైకిల్స్‌కు చెందిన విడిభాగాలు | - | - | 12 | 5 |





















