అన్వేషించండి

GST cut on Electronics 2025 : స్మార్ట్ టీవీలు, ఏసీలు, డిష్‌వాషర్‌లపై GST తగ్గింపు.. దసరా, దీపావళి ఆఫర్లతో మరింత చౌకగా

New GST Rates on Electronics : దీపావళి, దసరాకి ముందు GST రేట్లలో మార్పులు వచ్చాయి. TV, AC, డిష్​వాష్​ర్లపై GST 28% నుంచి 18%కి తగ్గింది. దీనివల్ల అత్యంత తక్కువ ధరకే ఈ వస్తువులు కొనుక్కోవచ్చు.

Electronics GST changes September 2025 : సాధారణంగా పండుగ సమయంలో ఈ-కామర్స్​ బెస్ట్ డీల్స్ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో స్మార్ట్ టీవీ, ఏసీ వంటి వాటిపై మంచి తగ్గింపులు ఉంటాయి. ఆన్​లైన్​లోనే కాదు.. ఆఫ్​లైన్​లో కూడా మంచి డీల్స్​కి వీటిని కొనుక్కునే సౌలభ్యం ఉంటుంది. అయితే తాజాగా GST రేట్లలో మార్పులు తీసుకువస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్మార్ట్​ టీవీలు (Smart TV GST Cut 2025), ఎయిర్ కండిషనర్లు (AC GST Reduction India), డిష్‌వాషర్‌లు మరింత చౌకగా మారనున్నాయి.

స్మార్ట్ టీవీ, ఏసీ, డిష్​వాషర్​ ఇలా వీటిలో ఏదైనా ఉపకరణాలను కొనాలనుకుంటే.. మీరు దసరా, దీపావళి(Diwali Festive Offers 2025) వరకు వేచి ఉంటే మంచిది. ఎందుకంటే జీఎస్టీ తగ్గింపులతో పాటు.. పండుగ ఆఫర్లు కూడా ఉంటాయి. దీనివల్ల మీరు మరింత తక్కువ ధరకే మీకు నచ్చిన వస్తువు కొనుక్కునే సౌలభ్యం ఉంటుంది. GST కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి. మరి స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్‌లు కొత్త జీఎస్టీ రేట్లతో ఎంత ధరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

28 శాతం నుంచి 18 శాతం తగ్గింపు

GST కౌన్సిల్ 56వ సమావేశంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ రేట్లలో మార్పులు చేసింది. ఇది సామాన్యులకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. గతంలో 32 అంగుళాల కంటే పెద్ద స్క్రీన్ కలిగిన టీవీలు (LCD, LED), ACలు, డిష్‌వాషర్‌లపై 28 శాతం GST ఉండేది. కానీ ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించారు. మానిటర్లు, ప్రొజెక్టర్లు, ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్లు (నాన్-లిథియం అయాన్)పై కూడా జీఎస్టీ రేట్లు తగ్గాయి. దీనివల్ల ACలు, పెద్ద స్క్రీన్ టీవీలకు మరింత డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. తద్వారా మార్కెట్‌లో ఎక్కువ డబ్బు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

డిష్‌వాషర్‌లపై GST తగ్గించడం వల్ల జీవన సౌలభ్యం పెరుగుతుందని, మానిటర్లు, ప్రొజెక్టర్ల వంటి వస్తువుల ధరలు తగ్గడం వల్ల విద్యాసంస్థలు, కార్యాలయాలు, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్ల ధరలు తగ్గడం వల్ల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ చౌకగా మారతాయి. దీనివల్ల డిజిటల్ పరికరాల కోసం పవర్ బ్యాకప్‌ను యాక్సెస్ చేయడం సులభం అవుతుందని భావిస్తున్నారు.

పండుగ సేల్స్ 

దీపావళి, దసరా సమయంలో ఈ-కామర్స్ కంపెనీలు కూడా తమ సేల్స్ ప్రారంభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్​తో పాటు.. ఆఫ్​లైన్​లో కూడా మంచి ఆఫర్స్ ప్రకటిస్తారు. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్రిజ్‌ల వరకు, ఫ్యాషన్ నుంచి బ్యూటీ ప్రొడక్ట్‌ల వరకు భారీ డిస్కౌంట్‌లు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి జీఎస్టీ తగ్గిందని ఇప్పుడు వస్తువులు తీసుకోవాలనుకుంటున్న వారు.. పండుగ సమయం వరకు ఎదురు చూస్తే మరింత చీప్​గానే వీటిని పొందవచ్చు. పైగా సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలు కాబట్టి.. దానిని కాస్త ఎక్స్​టెండ్ చేసి ఆఫర్లు మొదలయ్యాక తీసుకుంటే మంచిది. ఫ్లిప్​కార్ట్, అమెజాన్​ వంటి వాటిలో క్రెడిట్ కార్డ్​తో తీసుకోవడం వల్ల మరింత తక్కువ ధరకే వీటిని పొందవచ్చు. కాబట్టి మరిన్ని రోజులు ఎదురుచూస్తే మంచి డీల్స్ మీ సొంతమవుతాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget