అన్వేషించండి

Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?

Nara Lokesh: నారా లోకేష్ ప్రధాని మోదీతో భేటీ కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Lokesh meets Prime Minister Modi on Friday: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది కాలం నుంచి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మోదీతో భేటీ కాలేదు. ఇతర మంత్రుల్ని కలిసి రాష్ట్ర అంశాలపై మాట్లాడి వచ్చారు.  

గతంలో కుటుంబంతో సహా కలిసిన నారా లోకేష్                  

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీతో లోకేష్ ఓ సారి సమావేశం అయ్యారు. రెండు సార్లు ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ.. నారా లోకేష్‌ను కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చి కలవాలని సూచించారు. ఆ సూచన ప్రకారం గతంలో కుటుంబంతో సహా ప్రధానని కలిశారు. అయితే అప్పట్లో ఆ సమావేశంలో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించలేదని కేవలం వ్యక్తిగత అంశాలపైనే మాట్లాడారని తెలుస్తోంది. అందుకే ఈ సారి పూర్తిగా పాలనా పరమైన..రాజకీయ సంబంధమైన అంశాలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.           

గత నెలలో కేంద్ర మంత్రులతో సమావేశాలు -అప్పట్లో మోదీతో భేటీకి కుదరని సమయం            

గత నెలలో ఢిల్లీలో యూనియన్ మంత్రులతో లోకేష్ సమావేశాలు జరిపి, యూరియా కొరత, ప్లాస్టిక్ పార్క్, నిపర్ క్యాంపస్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో రామయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కుప్పం-బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కోరారు. ఇప్పుడు మోదీతో జరిగే భేటీలో ఈ అంశాలు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.    వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, విద్యా రంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్లోబల్ స్కిల్స్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది.              

పోలవరం, అమరావతి పురోగతిపై మోదీకి వివరించే అవకాశం

పోలవరం  , అమరావతి నిర్మాణాల పురోగతిని ప్రధాని మోదీకి లోకేష్ వివరించే అవకాశం ఉంది.  మోదీ-లోకేష్ సమావేశం తర్వాత రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు రావచ్చని అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహాయం, రాజకీయ సమన్వయం వంటి కీలక అంశాలపై  ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.  లోకేష్ సెప్టెంబర్ 4 రాత్రి ఢిల్లీకి బయలుదేరి, 5 ఉదయం మోదీతో సమావేశమై, మధ్యాహ్నం అమరావతికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.          

గత ప్రభుత్వం చేసిన అవినీతిపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను కూడా నారా లోకేష్ ప్రధానికి వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget