అన్వేషించండి

Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్

Pawan Kalyan Seed Balls : అడవుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్. డ్రోన్ల సాయంతో వెయ్యి ఎకరాల్లో సీడ్ బాల్స్ జారవిడిచిన అటవీశాఖ. 30 వేల హెక్టార్లే లక్ష్యంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు.

AP Forest Department Drone Seeding:  రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం, క్షీణించిన అడవులను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాల్లో ఏకో-రిస్టోరేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ డ్రోన్ సాంకేతికతకు శ్రీకారం చుట్టారు. మనుషులు నేరుగా వెళ్లలేని లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాలలో సీడ్ బాల్స్ చల్లేందుకు డ్రోన్లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షపాతం మరియు నేలలో తేమ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన బంతుల జారవిడిచే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.

 50 శాతం  గ్రీన్ కవర్ లక్ష్యం

కూటమి ప్రభుత్వం నిర్దేశించుకున్న 50 శాతం  గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించడంలో ఈ సీడ్ బాల్స్ కార్యక్రమం అత్యంత కీలకమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీశాఖ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగం దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో 63 లక్షలకు పైగా విత్తన బంతులను ఇప్పటికే చల్లారు. మానవ వనరుల సాయంతో చేరుకోలేని దుర్గమ ప్రాంతాల్లో దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సాంకేతికతను జోడించి డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచి కొత్త రికార్డు సృష్టించారు.

రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో అత్యధికంగా 28 లక్షల సీడ్ బాల్స్

జిల్లాల వారీగా పరిశీలిస్తే రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో అత్యధికంగా 28 లక్షల సీడ్ బాల్స్ చల్లగా, అందులో 2.26 లక్షల బంతులను కేవలం డ్రోన్ల సాయంతోనే లోయ ప్రాంతాల్లో జారవిడిచారు. అలాగే విశాఖపట్నం అటవీ డివిజన్‌లో 7.50 లక్షలు, కర్నూలు ప్రాంతంలో 8.67 లక్షల విత్తన బంతుల విసిరే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం చింతూరు, పీటీ ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం ,  కడప డివిజన్లలో కష్టతరమైన కొండలు, లోయ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఈ సీడ్ బాల్స్ పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ ప్రక్రియకు సవాలుగా మారవచ్చు. అందుకే వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ఏమాత్రం జాప్యం చేయకుండా సీడ్ బాల్స్ చల్లాలి. అవసరమైతే డ్రోన్ల సంఖ్యను మరింత పెంచండి అని సూచించారు. అడవులు క్షీణించిన ప్రతీ చోటా పునరుద్ధరణ పనులు వేగవంతం కావాలని, రాబోయే రోజుల్లో 30 వేల హెక్టార్లలో సీడ్ బాల్స్ వెదజల్లే సుదూర లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు.

మొలకలను సంరక్షించడం కూడా కీలకం

కేవలం విత్తన బంతులు చల్లడమే కాకుండా, వాటి ద్వారా వచ్చే చిన్న చిన్న మొలకలను సంరక్షించడంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఎండ తీవ్రతను తట్టుకుని ఆ మొలకలు పెద్ద చెట్లుగా మారేలా సంరక్షించే బాధ్యతను అటవీశాఖ అధికారులు స్వీకరించాలని స్పష్టం చేశారు. అధికారులు ఈ మహత్కార్యంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, క్షేత్రస్థాయిలో సీడ్ బాల్స్ పురోగతిని, మొక్కల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget