అన్వేషించండి

AP Liquor Scam Update: చెవిరెడ్డి ఇంట్లో సిట్ సోదాలు - కీలక ఆధారాలు స్వాధీనం

Liquor SIT: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

 SIT officers search Chevireddy house: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంతో పాటు చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ విజయానంద్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో 20 మంది సిబ్బందితో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్, తాజా సోదాలతో మరింత ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉంది.                 
 
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ బృందం బుధవారం తెల్లవారుజామున సోదాలు ప్రారంభించింది. 20 మంది సిబ్బందితో కూడిన ఈ బృందం, తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైస్‌లు, ఇతర కీలక ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించింది. ఈ కేసులో చెవిరెడ్డి  A-38 గా ఉన్నాg. గతంలో బెంగళూరు విమానాశ్రయంలో శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని సిట్ అరెస్ట్ చేసింది. అతనితో పాటు వెంకటేష్ నాయుడ్ని కూడా అరెస్టు చేశారు. తాము బిజినెస్ కోసం వెళ్తూంటే అరెస్టు చేశారని చెవిరెడ్డి అంటున్నారు.                     

సిట్ వర్గాల సమాచారం ప్రకారం, మద్యం కుంభకోణంలో సుమారు 250-300 కోట్ల రూపాయల నగదు ఎన్నికల ఖర్చుల కోసం రాజ్ కాసిరెడ్డి ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా  చెలామణి చేశారు. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద 8 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న ఘటన ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. సిట్ ఇప్పుడు ఈ సోదాల ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉంది.                  

అదే సమయంలో, చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ విజయానంద్ రెడ్డి నివాసంలోనూ సిట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో విజయానంద్ రెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అతని ఇంట్లో డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డులు,  ఎలక్ట్రానిక్ డివైస్‌లను సిట్ బృందం పరిశీలిస్తోంది.  విజయానందరెడ్డి గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులుకు టిక్కెట్ నిరాకిరంచి ఆయనకు చాన్స్ ఇచ్చారు. ఆయనపై  ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉండటంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. 

ఈ సోదాలు మద్యం కుంభకోణంలో విజయానంద్ రెడ్డి సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సిట్ ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతోంది. చెవిరెడ్డి, విజయానంద్ రెడ్డిల నివాసాల్లో సేకరించిన ఆధారాలను విశ్లేషించి, వారి ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది. ఈ సోదాలు కేసులో కీలక మలుపు తీసుకురావచ్చని, ఇతర రాజకీయ నాయకులు, అధికారుల పాత్ర కూడా బయటపడవచ్చని సిట్ వర్గాలు తెలిపాయి. త్వరలో మరో అనుబంధ చార్జిషీట్‌ను సిట్ దాఖలు చేసే అవకాశం ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Tungabhadra Dam 33 Crest Gates Inauguration: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Embed widget