By: ABP Desam | Updated at : 09 Apr 2022 02:54 PM (IST)
కర్ణాటకలో బెదిరింపుల కలకలం
కర్ణాటకలో ఆకతాయిలో.. నిజంగానే ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ స్కూళ్లతో పాటు ప్రముఖులకూ వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం రోజుల బెంగళూరులోని ఏడు ఇంటర్నేషనల్ సూక్ల్స్కు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఏడు పాఠశాలకు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు హుటాహుటినా చేరుకొని పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. స్కూళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ పేలుడు పదార్థాలు లభించలేదు. ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నా... సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.
Many school Students in Bengaluru evacuated from multiple schools that received bomb threats via email earlier today.
— Sunaina Bhola (@sunaina_bhola) April 8, 2022
Bomb disposal squad on spot.
I Wish this is hoax call.#bombthreat #Bengaluru #school pic.twitter.com/Y4HhVeNnQz
స్కూళ్లలో బాంబుల బెదిరింపుల వ్యవహారం సద్దుమణగక ముందే మాజీ సీఎంలు సహా 63 మందిని ఏ క్షణంలోనైనా చంపేస్తామని సోషల్ మీడియాల బెదిరింపులు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలకు చంపేస్తామంటూ గుర్తు వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. మరో 61 మంది రచయితలకు కూడా ఇదే తరహా లేఖలు అందాయి. అయితే, ఈ లేఖలు ఎవరు పంపించారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ వారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వర్గం పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి' అని రాసి ఉంది. ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అని రాసి ఉండడంతో చర్చనీయాంశంగా మారింది.
As many as 64 persons, including #Karnataka Opposition leader #Siddaramaiah (@siddaramaiah), former Chief Minister #HDKumaraswamy (@hd_kumaraswamy) and famous progressive litterateur K. Veerabhadrappa, have received death threat messages which are doing rounds on social media. pic.twitter.com/9wudrfYnD8
— IANS (@ians_india) April 9, 2022
గతంలో రచయితలు కలుబురిగి, లంకేష్ వంటి వారిని హత్య చేశారు. అంతకు ముందు కూడా వారికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ బెదిరింపుల్ని సీరియస్‌ా తీసుకోవాలన్న డిమాండ్లు కర్ణాటకలో వినిపి్తున్నాయి. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే తగిన భద్రత కల్పించాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూళ్లకు వచ్చిన బెదిరింపు లేఖలు.. అలాగే రాజకీయ నేతలు, రచయితలకు వచ్చిన లేఖలకు సంబంధం ఉందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు అంశాల్లోనూ పోలీసులు ఎవరి పని అనే దానిపై పరిశోధన చేస్తున్నారు. ఇంకా నిందితులెర్నీ పట్టుకోలేదు.
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !