10th Class MLA exams : పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే ! పాసవుతానో లేదోనని ఎంత టెన్షన్ పడుతున్నారంటే
ఒరిస్సాలో అధికార పార్టీ ఎమ్మెల్యే అంగద కనార్హ్ కి పదో తరగతి పాసవ్వాలనేది లక్ష్యం. కానీ ఆయన తొమ్మిది వరకే చదివారు. 58 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాస్తున్నారు.
ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా పేరుతో పాటు చదువు కాలమ్ కూడా ఉంటుంది. అలాంటి కాలమ్ ఫిల్ చేయాలంటే ఒరిస్సాకు ( Orissa MLA ) చెందిన రాజకీయ నాయకుడు అంగద కన్హార్ కొద్దిగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే ఆయన చదివింది తొమ్మిదో తరగతే. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యారు. మా ఎమ్మెల్యే పదో తరగతి కూడా చదవలేదని ప్రజలు చెప్పుకోవడం ఆయనకు నచ్చలేదు. అంతే కాదు.. తనకు కూడా క్వాలిఫికేషన్ పెంచుకోవాలన్న పట్టదల ఉంది. అందుకే పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించి.. చదువుకుని పరీక్షలు రాయడం ప్రారంభించారు.
భారత్‌లో రానున్నది ఇసుక సంక్షోభం - ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు ఇవే !
ప్రస్తుతం ఎమ్మెల్యే అంగద కన్హార్ ( MLA Angad Kanhar ) వయసు 58 ఏళ్లు. ఆయన అధికార బిజూ జనతాదళ్ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌కు సన్నిహితుడు. పుల్బానీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. పరీక్షల ( Tenth Exams ) కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అయి.. పరీక్షలకు హాజరవుతున్నారు. అంగద కన్హార్ 1978లో పదోతరగతి చదవాల్సి ఉండగా.. కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల చదువుకోలేకపోయారట. చదువు మీద ఇష్టంతో.. ఆయన ఈ వయసులో బిడియాన్ని పక్కనపెట్టి చదువుకుంటున్నారు. పైగా చదువుకుంటే పెరిగేది జ్ఞానమే కదా.. సిగ్గుపడాల్సిన అవసరమెందుకు? అంటున్నాడు అంగద కన్హార్. ఈ సంవత్సరం ఒడిశాలో పదోతరగతి పరీక్షల్ని 5.8 లక్షల రాస్తున్నారు. ఈ పరీక్షలకు మే 10వ తేదీ వరకు జరగనున్నాయి.
సీఎం- న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం- సీఎం జగన్ హాజరు, కేసీఆర్ డుమ్మా!
ఒడిషాలో అక్షరాస్యతా రేటు కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ అక్కడి ప్రభుత్వం ( Odisha Governament ) ఇటీవలి కాలలో ప్రలందర్నీ అక్షరాస్యులుగా మార్చే క్రమంలో ఎన్నో చర్యలు చేపడుతుంది. పలితంగా వయసుతో సంబంధం లేకుండా అనేక మంది విద్యార్హతను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యాభైఏళ్లు దాటిన వారు పదో తరగతి పరీక్షలు ( Exams ) రాస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఎమ్మెల్యే పరీక్ష రాస్తున్న కేంద్రంలోనే మరో ఐదారుగురు పెద్ద వ్యక్తులు తమ ప్రతిభను పేపర్ పై పెడుతున్నారు. అందులో ఎమ్మెల్యే మిత్రుడు ( MLA Friend ) కూడా ఉన్నారు.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు గండమే - కొత్త కంపెనీలతో వస్తున్న అంబానీ, అదానీ !