Ambani, Adani Battle With Netflix, Amazon : నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు గండమే - కొత్త కంపెనీలతో వస్తున్న అంబానీ, అదానీ !
డిజిటల్ మీడియా, ఓటీటీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు అంబానీ, అదానీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్‌లకు గట్టి పోటీ ఖాయమని అంచనా వేస్తున్నారు.
దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగాపేరు తెచ్చుకున్న అంబానీ, అదానీలు ఇప్పుడు మీడియా రంగంలో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. దేశంలో కీలక ప్రజల ఆదరణ చూరగొంటున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్‌లపై గురి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలో ప్రస్తుతం వయాకామ్ 18 సంస్థ నడుస్తోంది. పారామౌంట్ గ్లోబల్ అనే సంస్థ కూడా ఇందులో భాగస్వామి. తాజాగా వయాకామ్ 18 లో రూ. 13,500 కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి జేమ్స్ ముర్డోక్ నేతృత్వంలోని బోధి ట్రీ సిస్టమ్స్ సిద్ధమయింది. అలాగే రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అదనంగా రూ. 1,645 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది.
ఇక గౌతమ్ అదానీ తన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ కింద మీడియా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. కానీ క్లింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటా కొనేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ కంపెనీ క్వింట్ డిజిటల్ మీడియాకు సబ్సిడరీ. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీడియా సెగ్మెంట్‌లో విస్తరించాలని గౌతమ్ అదానీ చూస్తున్నారు. వయాకామ్ 18 లో కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్లు రావడం, అదానీ గ్రూప్ నుంచి ఓ మీడియా కంపెనీ రావడంతో మీడియా సెగ్మెంట్‌లో పోటీ తీవ్రమయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
అటు అంబానీ ఇటు అదానీ టార్గెట్ ఓటీటీతో పాటు డిజిటల్ మార్కెట్ అని చెబుతున్నారు. కలర్స్ టీవీ ఛానెల్స్‌ను, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వూట్‌ను వయాకామ్ 18 నడుపుతోంది. జియో ఓటీటీ ప్లాట్‌పామ్ జియోసినిమా కూడా వయాకామ్ 18 కు ట్రాన్స్‌ఫర్ అవ్వనుంది. ఈ కంపెనీ రానున్న ఐపీఎల్ మీడియా రైట్స్ ఆక్షన్‌లో దక్కించుకునేందుకు బిడ్ వేయనుంది. డిస్నీ, అమెజాన్, సోనీ గ్రూప్ కార్పొరేషన్‌లు ఐపీఎల్ కోసం తీవ్రంగా ప్రయత్నించనున్నాయి. వీరికి వయాకామ్ పోటీ ఇవ్వనంంది. ఓటీటీ, డిజిటల్ రంగంలో ఎక్కువగా గ్రోత్‌కు అవకాశం ఉన్న అతిపెద్ద మార్కెట్ ఇండియానేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారణంగా ఇండియా బిలియనీర్లు మీడియారంగంపై దృష్టి పెట్టారు.
అదానీ, అంబానీలు పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియా రంగంలోకి వస్తే నెట్ ఫ్లిక్స్, అమెజాన్‌లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఎంత క్వాలిటీ కంటెంట్ ఉన్నప్పటికీ సబ్‌స్క్రయిబర్లు పెరగడంలేదు. ధరలు దీనికి ప్రధానకారణం. అమెజాన్ కూడా పాత బడిపోతోంది. కొత్తగా యున ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ ఇద్దరు కుబేరులు పెట్టుబడులు కుమ్మరిస్తే.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం ఖాయమేనంటున్నారు.