CJI NV Ramana: సీఎం- న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం- సీఎం జగన్ హాజరు, కేసీఆర్ డుమ్మా!
CJI NV Ramana: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని సీజేఐ ఎన్‌వీ రమణ అన్నారు.
CJI NV Ramana: దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
We must be mindful of 'Laxman Rekha', judiciary will never come in way of governance if it's as per law. If municipalities, gram panchayats perform duties, if police investigate properly &illegal custodial torture comes to end, people need not have to look to courts:CJI NV Ramana pic.twitter.com/amgosbcX5i
— ANI (@ANI) April 30, 2022
తెలుగు రాష్ట్రాల నుంచి
ఈ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, గుజరాత్ సీఎం భూపెంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు.
న్యాయవ్యవస్థ బలోపేతం, న్యాయవ్యవస్థ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు, కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పనపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
Also Read: IT Jobs Alert: ఫ్రెషర్లకు పండగే పండగ- 90 వేల ఐటీ ఉద్యోగాల మేళా, వర్క్ ఫ్రం హోంపై కీలక ప్రకటన!
Also Read: Elon Musk Coca-Cola memes : కోక్‌ను మస్క్ కొనేస్తారా ? నెటిజన్ల రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు