IT Jobs Alert: ఫ్రెషర్లకు పండగే పండగ- 90 వేల ఐటీ ఉద్యోగాల మేళా, వర్క్ ఫ్రం హోంపై కీలక ప్రకటన!
IT Jobs Alert: ఐటీ సంస్థలు ఈ ఏడాది భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి. దీంతో పాటు వర్క్ ఫ్రమ్ హోంపై కూడా కీలక ప్రకటన చేశాయి.
IT Jobs Alert:
కరోనా సంక్షోభం కొనసాగుతోన్న వేళ కూడా ఐటీ సంస్థలు ఉద్యోగ నియామకాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 40 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు సిద్ధమైంది. మరో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ 50 వేల మందికి ఉద్యోగ అవకాశం ఇవ్వనుంది.
కొత్త ఉద్యోగాల హైరింగ్‌లో ఐటీ కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు 2021 ఆర్థిక సంవత్సరంలో 61 వేల క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు చేపట్టాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ లక్షమందిని, ఇన్ఫోసిస్ 85 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఇచ్చింది.
2023 ఆర్థిక సంవత్సరానికి గాను 50 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇన్ఫోసిస్ టార్గెట్ పెట్టుకుంది.
ఇదే బాటలో టీసీఎస్ కూడా నడుస్తోంది. ఈ ఏడాది దాదాపు 40 వేల ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఈ సంఖ్య మరింత పెంచేందుకు కూడా రెడీగా ఉన్నట్లు పేర్కొంది.
వర్క్ ఫ్రమ్ హోం
కరోనా ఫోర్త్ వేవ్ అంచనాల వేళ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంపై కూడా కీలక ప్రకటన చేశాయి. ’25X25′ మోడల్‌ను తాము కొనసాగించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మోడల్ ప్రకారం ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి క్రమంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు అలవాటు చేయాలి. దీని ప్రకారం 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేయాలి. అలానే తమ పని సమయంలో 25 శాతం కంటే ఎక్కువ సేపు ఆఫీసు నుంచి వర్క్ చేయాల్సిన అవసరం లేదు.
కరోనా వేళ ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హైబ్రిడ్ మోడల్‌నే అమలు చేయనున్నట్లు హెచ్‌సీఎల్ తెలిపింది. ఇన్ఫోసిస్ కూడా క్రమంగా తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించాలని అనుకుంటున్నామని.. కానీ ఇందులో ఎలాంటి గాబరా లేదని పేర్కొంది.
Also Read: Power Cuts Problem : కరెంట్ లేక..బొగ్గు లేక కాదు.. డబ్బుల్లేక కోతలు ! అసలు నిజాలు ఇవిగో
Also Read: Elon Musk Coca-Cola memes : కోక్‌ను మస్క్ కొనేస్తారా ? నెటిజన్ల రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు