అన్వేషించండి

India Covid Cases: 199 రోజుల తర్వాత కనిష్ఠానికి యాక్టివ్ కేసులు.. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో మరో రికార్డు..

దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 199 రోజుల తర్వాత ఈరోజు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,842 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 199 రోజుల తర్వాత ఈరోజు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కొత్తగా నమోదవుతోన్న కోవిడ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,842 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,38,13,903కి చేరింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య (24,354) కాస్త తగ్గింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.

నిన్న ఒక్కరోజే 244 మంది కోవిడ్ కారణంగా కన్నుమూశారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 4,48,817కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,70,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 199 రోజులుగా నమోదైన యాక్టివ్ కేసులతో పోలిస్తే ఇదే అత్యల్పం కావడం విశేషం. గత 24 గంటల్లో 25,930 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,30,94,529కి చేరింది. గత 24 గంటల్లో 12,65,734 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 57,32,60,724 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. 

Also Read: మీకు కరోనా సోకి తగ్గిందా? జాగ్రత్త.. ఈ కొత్త సమస్య రావొచ్చు, నిమ్స్‌లో ఆరుగురి చేరిక..

90 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ మరో కొత్త రికార్డు అందుకుంది. దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి టీకాలు అందించిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటివరకు 90,51,75,348 మందికి టీకాలు అందించినట్లు పేర్కొన్నారు. 

Also Read: ఇకపై సొంత ఊరి నుంచే పని.. 'వర్క్ ఫ్రమ్ హౌమ్ టౌన్'.. దేశంలోనే ఏపీలో తొలిసారి

Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP Panchayat Elections Live Updates: ఏపీలో రెండోదశ గ్రామ పంచాయతీ పోలింగ్.. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
ఏపీలో రెండోదశ గ్రామ పంచాయతీ పోలింగ్.. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?
E20 పెట్రోల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 నిజమైన మైలేజ్‌ ఇదే.. ఆన్‌రోడ్‌ ధర ఎంతంటే?
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Embed widget