India Elected To UNESCO Panel: యునెస్కోలోని ఆ కమిటీలో భారత్, ఆరు దేశాలు పోటీ పడినా దక్కని చోటు
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటున్నందుకు గానూ యునెస్కోలోని ఐహెచ్‌సీ కమిటీలో భారత్ ఎంపికైంది. ఆరు దేశాలు పోటీ పడినా, వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది.
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో భారత్ భేష్..
యునెస్కోలోని ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీలో భారత్ చోటు దక్కించుకుంది. సాంస్కృతిక వారసత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నందుకు గానూ యునెస్కోలో భాగమైన ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్-ICH కమిటీకి ఎంపికైంది. 2022 నుంచి 2026 వరకూ భారత్ ఈ కమిటీలో కొనసాగనుంది. ఈ ICH కమిటీలో ఇప్పటికే రెండు సార్లు చోటు సంపాదించుకుంది. 2006-10 వరకూ మొదటిసారి, 2014-18 వరకూ రెండోసారి కమిటీలో ఉంది. ఇప్పుడు మరోసారి అదే కమిటికీ ఎంపికైంది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో వెల్లడించారు. "ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ తరుణంలో భారత్ రెండు కీలక కమిటీలకు ఎంపికవటం ఆనందంగా ఉంది. ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్-ICH,వరల్డ్ హెరిటేజ్ కమిటీల్లో భారత్ చోటు సంపాదించుకుంది. వసుదేవ కుటుంబకం అనే భారత మౌలిక సూత్రాన్ని మరోసారి చాటి చెప్పేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. యునెస్కోలో భాగమైన ఈ IHC కమిటీ సాంస్కృతిక వారసత్వ కట్టడాలను ఎలా పరిరక్షించుకోవాలి, వాటిని రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై పూర్తి స్థాయి గైడెన్స్ ఇస్తుంది. ఇందుకు సంబంధించిన పలు సిఫార్సులనూ చేస్తుంది.
Proud Moment for India 🇮🇳
— Ministry of Information and Broadcasting (@MIB_India) July 8, 2022
➡️Elected as a member of the Inter-governmental Committee of #UNESCO for the Intangible Cultural Heritage for 2022-2026
➡️14 Indian elements in the Intangible Cultural Heritage list
Watch this video to know more👇@ianuragthakur @kishanreddybjp pic.twitter.com/sEbyvQ2s69
India has been elected as a member of Intergovernmental Committee of #UNESCO’s 2003 Convention for the Safeguarding of the Intangible Cultural Heritage for 2022-2026 cycle@kishanreddybjp says this is yet another opportunity for India to reinstate values of Vasudhaiva Kutumbakam pic.twitter.com/MehNsTcjS8
— All India Radio News (@airnewsalerts) July 7, 2022
ఆరు దేశాలు పోటీ పడినా..భారత్‌కే ఓటు
ఈ కట్టడాలను కాపాడుకోవటంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఇందుకోసం ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేపడతారు అనే వివరాలతో ఈ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వినతులన్నింటినీ పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటారు. అంతే కాదు. అవసరమైన సమయంలో అంతర్జాతీయ సహకారాన్నీ తీసుకునేందుకు ఈ కమిటీ తోడ్పడుతుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి దాదాపు ఆరు దేశాలు ఈ కమిటీలో ఎంపికయ్యేదుకు దరఖాస్తు చేసుకున్నాయి. బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్ కూడా భారత్‌తో పాటు అప్లై చేశాయి. అయితే ఈ ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించగా 110 ఓట్లు సాధించింది భారత్. 2022-26 మధ్య కాలంలో సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటామన్న విషయాలను స్పష్టంగా వివరించింది భారత్. అందుకే అంత మంది మద్దతుతో కమిటీకి ఎంపికైంది.