News
News
వీడియోలు ఆటలు
X

India-China Border: చైనా కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది, భారత్‌కే మా ఫుల్ సపోర్ట్‌ - అమెరికా

India-China Border: భారత్ చైనా సరిహద్దు వివాదంపై మరోసారి అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది.

FOLLOW US: 
Share:

 India-China Border:

వైట్‌హౌజ్‌ ప్రకటన..

భారత్ చైనా సరిహద్దు వివాదంపై మరోసారి అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. పదేపదే చైనా...భారత్‌ను కవ్వించాలని చూస్తోందని మండి పడింది. వైట్‌హౌజ్‌లోని ఓ ఉన్నతాధికారి దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతునిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిప్యుటీ అసిస్టెంట్, ఇండో పసిఫిక్ కో ఆర్డినేటర్ కర్ట్ క్యాంప్‌బెల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"అమెరికాకు భారత్ మిత్ర దేశం కాదు. భవిష్యత్‌లోనూ ఈ మైత్రి ఉండకపోవచ్చు. అలా అని మా రెండు దేశాలు కలిసి పని చేయవని అనుకోడానికి వీల్లేదు. చాలా విషయాల్లో మేం పరస్పరం సహకరించుకుంటాం. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత ఏంటో మనం అంతా అర్థం చేసుకోవాలి. ఈ విషయం మేం అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని బలపరుచుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇప్పటికే ఇది జరుగుతోంది. ఇకపై ఇది మరింత బలంగా మారుతుంది" 

- కర్ట్ క్యాంప్‌బెల్, జో బైడెన్ డిప్యుటీ అసిస్టెంట్

ఇదే సమయంలో భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించారు కర్ట్ క్యాంప్‌బెల్. ఇక్కడ వివాదం ముదిరితే..అది అమెరికాపైనే కాకుండా...ఇండియా పసిఫిక్ ప్రాంతంపైనా ప్రభావం పడే ప్రమాదముందని అగ్రరాజ్యం భావిస్తోంది. అందుకే...ఇక్కడి పరిస్థితులపై నిఘా పెట్టినట్టు చెబుతోంది. 

"భారత్‌ను చైనా పదేపదే కవ్విస్తోంది. 5 వేల మైళ్లున్న సరిహద్దు ప్రాంతంలో చైనా భారత్‌ను ఎలా కవ్విస్తోందో స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇది కచ్చితంగా ఖండించాల్సిన విషయమే. భారత్‌కే కాదు. భారత్ మిత్ర దేశాలనూ ఇది ఇబ్బంది పెట్టే అంశం" 

- కర్ట్ క్యాంప్‌బెల్, జో బైడెన్ డిప్యుటీ అసిస్టెంట్

అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌దే..

అరుణాచల్‌ ప్రదేశ్ విషయమై చైనా ఎన్నో ఏళ్లుగా భారత్‌తో తగువులాడుతోంది. అరుణాచల్‌ తమ దేశంలో భాగమే అంటూ వాదిస్తోంది. భారత్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చాలా సార్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌కు మద్దతుగా నిలిచింది. మెక్‌మహాన్‌ రేఖకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా పాస్ చేసింది. మెక్‌మహాన్ రేఖను అరుణాచల్ ప్రదేశ్, చైనా మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. 

"ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని చైనా చూస్తోంది. ఇలాంటి సమయంలో వ్యూహాత్మక మైత్రి ఉన్న దేశాలతో అమెరికా మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. ముఖ్యంగా భారత్‌కు తప్పకుండా అండగా ఉంటాం" 

- సెనేటర్ 

అంతే కాదు. ఇదే తీర్మానంలో అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాన్ని భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పింది అమెరికా. ఎల్‌ఏసీ విషయంలో భారత్‌తో జరిగిన ఒప్పందాలను చైనా ఖాతరు చేయకపోవడంపై మండి పడింది. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని వెల్లడించింది. దాదాపు ఆరేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. గల్వాన్ ఘటనతో అది రుజువైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను PRCలో భాగమే అన్న చైనా వాదనను అమెరికా చాలా తీవ్రంగా ఖండిస్తోంది. 

Also Read: Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్

Published at : 31 Mar 2023 02:26 PM (IST) Tags: USA India China Border India China  India-China  India-China Border Conflict

సంబంధిత కథనాలు

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!