News
News
వీడియోలు ఆటలు
X

Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్

Mosquito Coil Fire Delhi: మస్కిటో కాయిల్‌ పరుపుపై పడి మంటలంటుకోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

FOLLOW US: 
Share:

Mosquito Coil Fire Delhi:

పరుపుపై పడి మంటలు..

ఢిల్లీలోని ఓ కుటుంబాన్ని మస్కిటో కాయిల్‌ మింగేసింది. శాస్త్రిపార్క్‌లోని ఓ ఇంట్లో మస్కిటో కాయిల్ పెట్టుకుని ఆరుగురు కుటుంబ సభ్యులు నిద్రపోయారు. అది ఉన్నట్టుండి పరుపుపై పడింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని ఇల్లంతా వ్యాప్తి చెందాయి. ఆ మంటలకు వాళ్లకు ఊపిరాడలేదు. శ్వాస తీసుకోలేక కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలొదిలారు. ఆ కాయిల్‌ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్‌ కారణంగానే శ్వాస అందక చనిపోయారని వైద్యులు వెల్లడించారు. ముందుగా ఓ దిండుకి మంటలు అంటుకున్నాయని, ఆ తరవాత పరుపూ పూర్తిగా కాలిపోయిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళ, ఓ చిన్నారి ఉన్నట్టు వెల్లడించారు. 

"ఉదయం 9 గంటలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాం. ఈ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో 9 మంది ఉన్నారు. ఆరుగురు మృతి చెందారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతానికి వాళ్లకు చికిత్స అందిస్తున్నాం. వాళ్లు నిద్రించే సమయంలో ఉన్నట్టుండి మస్కిటో కాయిల్ దిండుపై పడి మంటలంటుకున్నాయి. ఇల్లంతా పొగ కమ్మేసింది. అది పీల్చడం వల్ల వాళ్లంతా కోమాలోకి వెళ్లిపోయారు. శ్వాస ఆడక చనిపోయారు" 

- పోలీసులు

వీళ్ల ప్రాణాలు తీసింది ఆ మస్కిటో కాయిల్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది పీల్చితే శరీరమంతా ఉన్నట్టుండి పాలిపోతుంది. శ్వాస ఆడదు. స్పృహ కోల్పోతారు. కోమాలోకి వెళ్లే అవకాశాలుంటాయి. ప్రాణాలు కోల్పోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో అదే జరిగింది. 

Also Read: Nitin Gadkari: నాకు రిటైర్ అయ్యే ఆలోచన లేదు, మీడియా కాస్త బాధ్యతగా ఉంటే మంచిది - రూమర్స్‌కు చెక్ పెట్టిన గడ్కరీ

Published at : 31 Mar 2023 01:05 PM (IST) Tags: Mosquito Coil Fire Delhi Mosquito Coil Fire Accident Mosquito Coil Shastri Park

సంబంధిత కథనాలు

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

Canada Gangster Murder : కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ సింగ్ మర్డర్ - అచ్చం సినిమాల్లోలాగే !

Canada Gangster Murder :   కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ సింగ్ మర్డర్ - అచ్చం సినిమాల్లోలాగే !

Delhi murder: ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తూండగానే బాలిక హత్య - నిందితుడు అరెస్ట్ !

Delhi murder:  ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తూండగానే బాలిక హత్య -  నిందితుడు అరెస్ట్ !

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!