అన్వేషించండి

Munvawar KTR BJP : కేటీఆర్ పిలిచారు... మునావర్ వస్తున్నారు ! మరి రాజాసింగ్ ఏం చేస్తారు ?

హైదరాబాద్‌లో జనవరి 9వ తేదీన జరగనున్న మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోను అడ్డుకుంటామని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ ఆహ్వానం పలకడంతో మునావర్ హైదరాబాద్‌లో షో ఏర్పాటు చేశారు.

వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ షో వివాదాస్పదం అవుతోంది. ఆయన  షో తొమ్మిదో  తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్‌లో జరగనివ్వబోమని హిందూ సంఘాలు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. హిందూ వ్యతిరేక భావనలతో ఆయన కామెడీ చేస్తూంటారని.. కించ పరుస్తూంటారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే షోను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని చెబుతున్నారు. 

 

Also Read: ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?

మునావర్ ఫారుఖీ షోలు ఎక్కడిక్కడ రద్దు అవుతూ వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట బెంగళూరులో ఆయన షోను రద్దు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హిందూ సంఘాలు హెచ్చరించడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు షోకు ఇచ్చిన  అనుమతిని క్యాన్సిల్ చేశారు. ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ ... ఓ కార్యక్రమంలో ఈ అంశంపై స్పందించారు. మునావర్ ఫారుఖీ హైదరాబాద్ వచ్చి "షో" చేయాలని ఆహ్వానించారు. తాము కామెడీని సీరియస్‌గా తీసుకోబోమని.. "షో"లకు ఇచ్చిన పర్మిషన్లను రద్దు చేయబోమన్నారు. 

 

Also Read: పెద్దల్ని ఎదిరించిన పెళ్లి చేసుకున్న లవర్స్.. ఉప్పెన సినిమా చూపించిన పేరెంట్స్‌..

కేటీఆర్ ఆహ్వానం ధైర్యం ఇచ్చిందేమో కానీ మునావర్ ఫారుఖీ వెంటనే హైదరాబాద్‌లో షోను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈవెంట్‌ టిక్కెట్లను కూడా అమ్మడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆయన షో వివాదాస్పదం అవుతోంది. ఇతర నగరాల్లో అడ్డుకున్నట్లుగానే తాము అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి మునావర్ ఫారుఖీతో పాటు కునాల్ కమ్రా అనే మరో స్టాండప్ కమెడియన్ ను కూడా బీజేపీ నేతలు.. హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారి షోలు జరగడం లేదు. 

Also Read: Cheating Relationship : చాలా ఏళ్ల శారీరక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు !

అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం వారికి రక్షణ లభిస్తోంది. ముంబై, కోల్ కతా వంటి చోట్ల వారు తమ స్టాండప్ కామెడీ షోలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వారికి భద్రత కల్పించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆహ్వానం పలకడంతో హైదరాబాద్‌లోనూ వారి షో నిరాటంకంగా సాగే అవకాశం ఉంది. హిందూ సంఘాలు హెచ్చరించినా.. పోలీసులు రక్షణ కల్పిస్తే షో జరగడం పెద్ద విషయం కాదని భావిస్తున్నారు. 

Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Breaking News: చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల వెళ్తున్న భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం 
చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల వెళ్తున్న భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం 
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget