News
News
X

Women Freedom Fighters : బ్రిటిష్ వారికే దడ పుట్టించిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులు - వీరి గురించి ఎక్కువ మందికి తెలియదు ! ఇవిగో వారి విశేషాలు

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్ని పది మంది ప్రముఖ మహిళా యోధుల గురించి వివరాలు ఇవిగో

FOLLOW US: 

 

Women Freedom Fighters :  భారత్‌కు స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లవుతోంది. ప్రతి మగాడి విజయం వెనుక మహిళ పాత్ర ఉంటుందంటారు. మరి అలాంటిది దేశానికి స్వాతంత్ర్యం సిద్దించడానికి ఎంత మంది వీర మహిళల పాత్ర ఉుండాలి. కొన్ని వేల మంది పోరాడారు. వారిలో కొంత మంది చరిత్రలో నిలిచిపోయారు. అలాంిట  పది మంది గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.  
  
1.  ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి 

ఝాన్సీ రాణి అంటే వీరత్వానికి మరో పేరుగా మనం చెప్పుకుంటాం. ఝాన్సీ రాణి అంటేనే గుండెలు ఉప్పొంగేంత ధైర్యం మనకు వస్తుంది. అంటే..మరి ఏ స్థాయి  ఆ వీర నారి బ్రిటిషన్ వారిపై పోరాడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన  వీర మహిళల్లో ఆమె ఒకరు.  భయం అనే పదానికి చోటే లేకుండా ఒంటరిగా బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. లక్ష్మి బాయికి చిన్న వయస్సులోనే ఝాన్సీ రాజు రాజా గంగాధరరావుతో వివాహం జరిగింది. వారిద్దరూ ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు, కానీ గంగాధర్ రావు  మరణం తరువాత.. ఝాన్సీకి కుమారుడ్ని రాజుని చేయడానికి అప్పటి బ్రిటిష్ పాలకులు అంగీకరించలేదు. ఇదే సందు అనుకుని ఝాన్సీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ లక్ష్మి బ ాయి  సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది.- ఆమె తన కొడుకును వెనుక కట్టుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. బ్రిటీషర్లు తమ వంతు ప్రయత్నం చేసినా చివరికి ఝాన్సీ రాణిని పట్టుకోలేకపోయారు. అయితే బ్రిటిష్ బలం ముందు నిలవలేకపోయారు. వారికి చిక్కడం కన్నా ప్రాణాలర్పించడం మంచిదని  ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఝాన్సీ రాణి లక్ష్మి బాయి చూపించిన సాహసం.. అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో ఝాన్సీరాణిలు రావడానికి స్ఫూర్తి అయింది.  


2. సరోజినీ నాయుడు 

సరోజినీ నాయుుడుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు. సరోజినీ నాయుడు స్వతంత్ర కవయిత్రి . శాసనోల్లంఘన ఉద్యమం , క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది, దాని కోసం ఆమె జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆమె అనేక నగరాలకు వెళ్లి మహిళా సాధికారత, సామాజిక సంక్షేమం మరియు స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రసంగించి చైతన్య పరిచేలవారు. సరోజినీ నాయుడు భారత రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన మొదటి మహిళ కూడా.  భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించిన రెండో మహిళ కూడా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే ఆమె కన్నుమూశారు. ఆమ చేసిన పోరాటం ప్రతీ రాష్ట్రంలో స్కూళ్లలో పాఠాలుగాఉంది. 

3. బేగం హజ్రత్ మహల్ 

బేగం హజ్రత్మహల్‌కు కూడా మహిళాస్వాతంత్ర్య సమరయోధుల్లో ప్రముఖులు. ఝాన్సీ లక్ష్మిబాయికి ఉండేంత ధైర్యసాహసాలు ఈమెకు ఉన్నాయి. 1857లో, తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు వచ్చారు.  గ్రామీణ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంవైపు మళ్లించిన వ్యక్తులను ఈమె ఒకరు.  ఆమె తన కుమారుడిని ఔద్ రాజుగా ప్రకటించి లక్నోను అధీనంలోకి తీసుకుంది. అంత పెద్దబ్రిటిషన్ పాలకులను సైతం ఎదిరించి స్వాధీనం చేసుకోవడంతో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే  తమను ఎదిరిస్తారా అని బ్రిటిష్ పాలకులు అదనపు సైన్యంతో వచ్చి దాడి చేయడంతో.. లక్నో పరిపాలనపై పట్టు కోల్పోయారు. 
 

4. కిత్తూరు రాణి చెన్నమ్మ 


మహిళా స్వాతంత్ర్య సమరయోధుల్లో చాలా మంది పేర్లకు ప్రాచుర్యం లభించలేదు. అలాంటి వారిలో ఒకరు కిత్తూరు రాణి చెన్నమ.  భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొద్దిమంది తొలి భారతీయ మహిళా పాలకులలో ఆమె ఒకరు. తన భర్త, కుమారుడు మరణించిన తర్వాత  రాజ్య బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది. అయితే బ్రిటిష్ పాలకులు ఆమె రాజ్యంపై ఎప్పుడూ కన్నేస్తూ ఉండేారు. ఆమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఆమె సైన్యానికి నాయకత్వం వహించి యుద్ధరంగంలో ధైర్యంగా పోరాడింది. అయితే  కిత్తూరు రాణి చెన్నమ్మ యుద్ధభూమిలో మరణించింది. ఆమె ధైర్యసాహసాల వెలుగు ఇప్పటికీ దేశంలో ప్రసిద్ధి చెందింది . కిత్తూరు రాణి చెన్నమ్మ గురించి కర్ణాటకలో అనేక పాఠ్యాంశాల్లో విద్యాభ్యాసాలు ఉన్నాయి. 


5. అరుణా అసఫ్ అలీ 

అరుణా అసఫ్ అలీ ఉప్పు సత్యాగ్రహంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో ఆమె పాల్గొనడం వల్ల జైలు శిక్ష కూడా అనుభవించారు.ఆమె జైలు నుండి విడుదలైన తర్వతా  క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు.  ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు ఎంత నిర్భయంగా ఉన్నారో అరుణా అసఫ్ అలీని సూచికాగ చూపిస్తారు.  తీహార్ జైలులో ఉన్న రాజకీయ ఖైదీల హక్కుల కోసం కూడా ఆమె పోరాడారు. అప్పట్లోనే ముస్లిం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని సమాజానికి దిశానిర్దేశం చేశారు. 

6. సావిత్రీబాయి ఫూలే 

  భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు విత్రీబాయి ఫూలే .  మొదటి భారతీయ బాలికల పాఠశాల స్థాపకురాలు కూడా.    “మీరు అబ్బాయికి విద్యను అందిస్తే, మీరు ఒక వ్యక్తికి  చదివించినట్లు..  కానీ   ఒక అమ్మాయిని చదివిస్తే, మీరు మొత్తం కుటుంబాన్ని చదివించినట్లు  ” అని చెప్పి అందరి కళ్లు తెరిపించే ప్రయత్నం చేఱారు.  ఆమె ప్రయాణంలో ఆమె భర్త జ్యోతిరావు ఫూలే ఆమెకు మద్దతుగా నిలిచారు. వారిద్దరూ అన్ని మూస పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడారు . సమాజంలో మహిళా సాధికారత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.   

7. ఉషా మెహతా 

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు ఉషా మొహతా. మహాత్మా గాంధీ  స్వాతంత్ర్య పోరాటం ఉషపై చాలా ప్రభావం చూపింది, ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో గాంధీని కలుసుకున్నారు. ‘సైమన్ గో బ్యాక్’ నిరసనలో పాల్గొన్నప్పుడు ఆమెకు కేవలం ఎనిమిదేళ్లు. ఆమె తండ్రి బ్రిటిష్ ప్రభుత్వం క్రింద న్యాయమూర్తి, గా పని చేసేవారు. అమె మనసు మార్చడానికి తండ్రి ప్రయత్నించారు .. కానీ సాధ్యం కాదు. మహాత్ముడితోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నది.   బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేడియో ఛానెళ్లను నడిపినందుకు ఆమెకు జైలు శిక్ష కూడా పడింది.

8. భికాజీ కామా 

  భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు బికాజీకామా . ఆమెను మేడమ్ కామా అని కూడా పిలిచేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె భారతీయ పౌరుల మనస్సులలో మహిళా సమానత్వం ,  మహిళా సాధికారత గురించి ప్రధానంగా ప్రచారం చేసేవారు  భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను స్థాపించిన మార్గదర్శకుల్లో ఆమె ఒకరు. ఆమె పార్సీ కుటుంబానికి చెందినవారు.  జాతీయ ఉద్యమాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.

9. లక్ష్మీ సెహగల్ 

సుభాష్ చంద్రబోస్ చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమానికి  ప్రభావితమై లక్ష్మిసెహగల్..బ్రిటిష్‌ వారిపై పోరాటానికి వచ్చారు.  స్వాతంత్ర్య పోరాటంలో ఆమె మహోన్నతమైన వ్యక్తి.  సుభాష్ చంద్రబోస్‌ ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో క్రియాశీల సభ్యురాలు.  ఆమె ఏకైక ఆశయం భారతదేశ స్వాతంత్ర్యం. ఆమె మహిళా విభాగాన్ని సృష్టించి దానికి ఝాన్సీ రెజిమెంట్‌కి చెందిన రాణి అని పేరు పెట్టింది. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అన్ని ఉద్యమాలలో ఆమె పాల్గొన్నారు. అన్ని విధాలుగా పోరాడి చరిత్ర సృష్టించించారు. 

10. కస్తూర్బా గాంధీ-

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చెరగని పేర కస్తూర్బా గాంధీతి.  ఆమె జాతిపిత మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ సతీమణి.  భారతదేశ స్వాతంత్ర్యానికి గాంధీ చేసిన కృషి గురించి మనందరికీ తెలుసు కానీ కస్తూర్బా గాంధీ గురించి అంతగా ప్రచారం కాలేదు.  ప్రముఖ మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలిగా ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. పౌర హక్కుల కోసం పోరాడారు.  దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా డర్బన్‌లోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో చురుకైన సభ్యురాలిగా వ్యవహరించారు.  ఇండిగో ప్లాంటర్స్ ఉద్యమం సమయంలో, పరిశుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్యం, క్రమశిక్షణ, చదవడం ,  రాయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక ప్రయత్నాల చేశారు. 

Published at : 08 Aug 2022 01:50 PM (IST) Tags: Independence Day Freedom Day Women Freedom Fighters Independence Freedom Struggle Saluting Bravehearts Naari Shakti

సంబంధిత కథనాలు

FIR Against Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంతపై కేసు- ఎందుకంటే?

FIR Against Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంతపై కేసు- ఎందుకంటే?

KTR News: న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు - అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కేటీఆర్

KTR News: న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు - అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కేటీఆర్

Breaking News Live Telugu Updates: శ్రీనివాసుడి సేవలో కాజల్ అగర్వాల్, భర్తతో కలిసి తొలిసారి తిరుమలకు

Breaking News Live Telugu Updates: శ్రీనివాసుడి సేవలో కాజల్ అగర్వాల్, భర్తతో కలిసి తొలిసారి తిరుమలకు

Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!

Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!

Kothagudem Politics: ఎన్నికల్లో పొత్తులు ఉంటే జలగం వెంకటరావు ఏ ఎత్తు వేయబోతున్నారు !

Kothagudem Politics: ఎన్నికల్లో పొత్తులు ఉంటే జలగం వెంకటరావు ఏ ఎత్తు వేయబోతున్నారు !

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం