Wife Call Recording Crime : భార్య ఫోన్ కాల్‌ను అనుమతి లేకుండా రికార్డ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ? ఇదిగో పంజాబ్- హర్యానా హైకోర్టు తీర్పు !
అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. వాటిని సాక్ష్యంగా పరిగణించలేమని రూలింగ్ ఇచ్చింది.
భార్యే కదా అని ఆమె ఫోన్లు రికార్డు చేస్తున్నారా ?. ఆమె వేధిస్తోందని నిరూపించడానికి ఫోన్ కాల్స్ రికార్డింగ్ మోడ్‌లో పెట్టారా ? అయితే తక్షణం మనసు మార్చుకోండి. ఎందుకంటే భార్య అయినా సరే ఆమె అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం. అనుమతి లేకుండా భార్య కాల్‌ని రికార్డ్ చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమే. ఈ విషయాన్ని పంజాబ్- హర్యానా హైకోర్టు తేల్చిచెప్పింది.
Also Read : AFSP చట్టంలో ఏముంది? నాగాలాండ్‌లో ఓ లెక్క.. కశ్మీర్‌లో మరో లెక్క ఎందుకు?
పంజాబ్‌లోని భటిండాలో ఓ వ్యక్తి తన భార్య వేధిస్తోందని... విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. వేధింపులకు సాక్ష్యంగా ఫోన్ కాల్స్ రికార్డింగ్‌లను సమర్పించాడు. ఈ ఫోన్ రికార్డింగ్‌లను ఫ్యామిలీ కోర్టు సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు అనుమతి లేకుండా కాల్స్ రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని తేల్చింది. అందుకే కింది కోర్టు సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకున్న కాల్ రికార్డింగ్స్ నిర్ణయాన్ని తోసి పుచ్చింది.
Also Read : పెళ్లికెళ్తే వ్యాక్సిన్ సర్టిఫికెట్ మస్ట్.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?
అనుమతి లేకుండా జీవిత భాగస్వామితో ఫోన్ సంభాషణను రికార్డ్ చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. తన భార్యపై నెగిటివ్ ఇమేజ్ చూపించేందుకు ఆమె అనుమతి లేకుండా కాల్స్ రికార్డ్ చేయడం హక్కులకు భంగం కలిగించడమేనని పంజాబ్, హర్యానా హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
Also Read : నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
24 ఆగస్టు 2017న, సుప్రీంకోర్టులోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం గోప్యత హక్కును రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. గోప్యత అనేది మానవ గౌరవానికి రాజ్యాంగ ప్రధానమని తీర్పు చెప్పింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో గోప్యత హక్కు ముఖ్యమైన అంశంగా గుర్తించారు. ఈ కారణంగా భార్య, భర్త కాల్సే కాదు ఎవరి కాల్స్‌ను అనుమతి లేకుండా రికార్డింగ్ చేయకూడదు. వాటిని సాక్ష్యంగా కూడా పరిగణించరు.
Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి