By: ABP Desam | Updated at : 09 Dec 2021 03:16 PM (IST)
Edited By: Murali Krishna
సాగు చట్టాల ఉద్యమం ముగింపు
సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాది కాలంగా చేస్తోన్న ఉద్యమానికి ఎట్టకేలకు ముగింపు పలికారు. ప్రభుత్వ హామీ అనంతరం నిరసనలకు ముగింపు పలికినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దిల్లీ- హరియాణా సింఘూ సరిహద్దు వద్ద నిరసన స్థలాల వద్ద ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను రైతులు తొలగిస్తున్నారు. డిసెంబర్ 11 లోపు నిరసన ప్రదేశాలను వదిలి వెళ్లనున్నట్లు కిసాన్ మోర్చా ప్రకటించింది.
Protesting farmers will vacate the protest sites on December 11: Farmer leader Darshan Pal Singh pic.twitter.com/Ftg76o7Rd1
— ANI (@ANI) December 9, 2021
కేంద్రం ఓకే..
ఉద్యమాన్ని నడిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రతిపాదిత సవరణలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనలకు ఎస్‌కేఎం సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి కేంద్రానికి పంపింది. కిసాన్ మోర్చా పంపిన సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిపై ఎస్‌కేఎంలోనూ ఏకాభిప్రాయం కుదిరింది.
రైతు ఉద్యమం సమయంలో దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను ఉద్యమం ముగించిన తరువాత ఉపసంహరించుకుంటామని కేంద్ర హోంశాఖ హామీ ఇచ్చింది. ముందు కేసులు ఉపసంహరించుకోవాలనీ, ఆ తర్వాతే ఉద్యమం ఆపుతామంటూ ఎస్‌కేఎం సవరణ కోరింది. వెంటనే కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రైతులు ఉద్యమాన్ని ముగించారు.
మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతలు దాదాపు ఏడాది పాటు చేసిన ఉద్యమానికి మోదీ సర్కార్ తలవంచింది. ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్ల స్వయంగా మోదీ ఇటీవల ప్రకటించారు. అనంతరం పార్లమెంటు శీతాకాల సమావేశంలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని పార్లమెంటు ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం పలికారు.
Also Read: Rohini Court Blast: దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఏం జరిగిందంటే?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు
Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...
Also Read: కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు
Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి
Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !
Bharti Airtel Q4 Earnings: జియోను బీట్ చేసిన ఎయిర్టెల్ ARPU, రూ.2007 కోట్ల బంఫర్ ప్రాఫిట్