Wedding Vaccines : పెళ్లికెళ్తే వ్యాక్సిన్ సర్టిఫికెట్ మస్ట్.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?
పెళ్లి మండపాల్లో వ్యాక్సిన్ వేయించుకోని వారిని పట్టుకుని వ్యాక్సినేషన్ చేసేస్తున్నారు గుజరాత్ ఆరోగ్య కార్యకర్తలు. ఒమిక్రాన్ కారణంగా వంద శాతం వ్యాక్సినేషన్ ను అక్కడి ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.
ఏడాదికో కొత్త కరోనా వేరియంట్ పుట్టుకొస్తోంది. ఈ వేరియంట్లను ఎదుర్కోవడానికి ఒక్కటే మార్గం అని వైద్య నిపుణులంతా ప్రకటిస్తున్నారు. కానీ వ్యాక్సినేషన్ మాత్రం చురుగ్గా సాగడం లేదు. దీనికి కారణం చాలా మంది ఆసక్తి చూపించకపోవడమే. అన్ని చోట్లాలానే గుజరాత్‌లోనూ ఈ సమస్య ఉంది. అయితే అందరిలా లైట్ తీసుకోలేదు గుజరాత్ సర్కార్. దీంతో వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లను పట్టుకని బలవంతంగా సూది గుచ్చేయడమే మార్గమని నమ్మింది. వెంటనే ఆచరణలో పెట్టింది.
Also Read : దేశంలో 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. తాజాగా గుజరాత్‌లో మరో ఇద్దరికి..
ప్రస్తుతం గుజరాత్‌లో పెళ్లిళ్ల సీజన్. అందుకే ప్రతి పెళ్లి మండపం దగ్గర వ్యాక్సిన్లతో సహా ఆరోగ్య కార్యకర్తలను పెడుతున్నారు. పెళ్లిళ్లకు హాజరవ్వాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ మస్ట్ అనే నిబంధన పెట్టడంతో ... కల్యాణ మండపాలకు వస్తున్న వారందరూ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తీసుకు రావాల్సి వస్తోంది. గేట్ల దగ్గరే వాటిని ఆరోగ్య కార్యకర్తలు చెక్ చేస్తున్నారు. వారి దగ్గర వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే క్షణం కూడా ఆలోచించడం లేదు వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు.
Also Read : నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
గేట్ల దగ్గర మిస్సయితే లోపల కూడా వెదుకుతున్నారు. వధూవరులను ఆశీర్వదించడానికి బంధువులంతా ఓ వైపు కోలాహలంగా ఉంటే మరో వైపు వివరాలు అడగి తెలుసుకుని.. వ్యాక్సినేషన్ వేయించుకోని వారికి వ్యాక్సిన్లు వేసేస్తున్నారు. కొసమెరుపేమిటంటే ఇలా పెళ్లిళ్లకు హాజరవుతున్న వారిలో చాలా మంది మెదటి డోసు కూడా తీసుకోని వాళ్లు ఉన్నారు. పెళ్లిళ్లే కాదు.. కమ్యూనిటీ హాళ్లూ, ఫంక్షన్ హాళ్లు.. ఇలా ఎక్కడ గుంపు కనిపిస్తే అక్కడికి వెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
Also Read : అంతర్జాతీయ విమాన సేవలపై కీలక ప్రకటన.. ఒమిక్రాన్ వ్యాప్తి వల్లే నిర్ణయం
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రం కూడా వ్యాక్సినేషన్ విషయంలో సీరియస్‌గా ఉండాలని సిబ్బందిని హెచ్చరిస్తున్నాయి. దీంతో రెండో డోస్ వారినే కాక..అసలు ఒక్క డోస్ వేసుకోని వారి కోసం కూడా సిబ్బంది వెంటాడి వ్యాక్సినేట్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి నిబంధనలు అమలు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి