అన్వేషించండి

Uniform Civil Code: యూనిఫామ్ సివిల్‌ కోడ్ అమలుకు అంతా సిద్ధం, కమిటీ నియమించిన ప్రభుత్వం

Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కమిటీని నియమించింది.

Uniform Civil Code in Gujarat:

కమిటీ రెడీ..

గుజరాత్ ప్రభుత్వం Uniform Civil Codeని అమలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తుండగానే...ఆ ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేబినెట్ ఈ కమిటీని నియమించేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారన్నది త్వరలో సీఎం ప్రకటించనున్నారు. ఓ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం  భూపేంద్ర పటేల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. "ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం సుప్రీం కోర్టు, లేదా హైకోర్ట్‌ రిటైర్డ్ జడ్జ్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. వాళ్లే దీనిపై ఓ ముసాయిదా తయారు చేస్తారు" అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో సీం భూపేంద్ర పటేల్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తామూ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సంకేతాలిచ్చాయి. భాజపా నేతలంతా ఈ కోడ్‌ అమలు చేయడాన్ని సమర్థిస్తున్నప్పటికీ...కొన్ని వర్గాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

ఇది రాజ్యాగబద్ధం కాదు..

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ఈ కోడ్ అమలు చేయడం రాజ్యాంగ బద్ధం కాదని, మైనార్టీలకు వ్యతిరేకమని మండి పడుతోంది. కేవలం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భాజపా ఇలా చేస్తోందని విమర్శిస్తోంది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన సమయంలో భాజపా యూనిఫామ్ సివిల్ కోడ్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా యూసీసీ అమలు చేయాలని పార్లమెంట్‌కు ఆదేశాలివ్వలేమని, ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలని గత నెల సుప్రీం కోర్టుకి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర న్యాయ శాఖ కూడా తన అఫిడవిట్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రజా ప్రతినిధులేనని, నేరుగా కేంద్ర ప్రభుత్వం యూసీసీ అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని సుప్రీం కోర్టుకి తెలిపింది. 

ఇదీ యూసీసీ..

సాధారణంగా మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంటుంది. ఆయా మతాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను అనుసరిస్తుంటారు. హిజాబ్, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు ఈ కోవకు వస్తాయి. అయితే...Uniform Civil Code అమలు చేస్తే అన్ని మతాలు, వర్గాలకు ఒకే చట్టం అమలవుతుంది. అంటే...అందరికీ కలిపి ఉమ్మడి చట్టం. మతాల వారీగా చట్టాలు ఉండటం వల్ల న్యాయవ్యవస్థపై భారం పడుతోందన్నది కొందరి వాదన. ఈ సివిల్ కోడ్‌ అమల్లోకి వస్తే ఏళ్లుగా నలుగుతున్న కేసులకూ వెంటనే పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Also Read: Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget