అన్వేషించండి

Vijay Cabinet : విజయ్ కేబినెట్‌లో అంతా సామాన్యులే - సినిమా వాళ్లకూ ప్రాధాన్యం - లిస్ట్ ఇదే ?

TVK : తమిళనాడులో తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కొత్త మంత్రులెవరన్నది ఆసక్తికరంగా మారనుంది.

TVK Vijay First Cabinet:   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన  తమిళగ వెట్రి కళగం అధినేత సి. జోసెఫ్ విజయ్, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేశారు. ఇప్పటికే   ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన క్లెయిమ్‌ను సమర్పించిన విజయ్, తన కేబినెట్ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు, నమ్మకమైన అనుచరులు,  యువత కలయికతో ఒక సమతుల్యమైన  టీమ్ విజయ్ సిద్ధమైంది. 

 సీనియర్లకు కీలక శాఖలు.. బుస్సీ ఆనంద్‌కు  హోం ? 

విజయ్ కుడిభుజంగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్ర పోషించిన  బుస్సీ ఆనంద్‌ కు కేబినెట్‌లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హోం శాఖ లేదా ప్రజా పనుల శాఖ దక్కే అవకాశం ఉంది. అలాగే, ఏఐఏడీఎంకే నుంచి వచ్చి టీవీకేలో చేరిన రాజకీయ ఉద్దండుడు సెంగోట్టయన్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆయనకు విద్యాశాఖ లేదా వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ఆదవ్ అర్జున కు పరిశ్రమలు లేదా ఆర్థిక శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలు దక్కనున్నాయి.

 సాంకేతికత, యువతకు పెద్దపీట 

సాంకేతిక రంగంలో నిపుణులైన  సీటీఆర్ నిర్మల్ కుమార్ ,  అరుణ్ రాజ్ లకు ఐటీ,  కమ్యూనికేషన్స్ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి విజయ్ వెంట నడుస్తున్న యువ నేతలు సత్యభామ, డాక్టర్ ప్రభు, మదురై కల్లనై, విజయ్ సరవణన్ వంటి వారికి వైద్యం, విద్య, సాంఘిక సంక్షేమ శాఖల్లో అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ సన్నిహితుడు, నటుడు శ్రీనాథ్ , ఐటీ వింగ్‌లో చురుగ్గా పనిచేసిన  రాజ్‌మోహన్‌ లకు కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 స్పీకర్ రేసులో ఇద్దరు హేమాహేమీలు  

శాసనసభను నడిపించే గౌరవప్రదమైన  స్పీకర్  పదవి కోసం  స్టాలిన్ పై గెలిచిన వి.ఎస్. బాబు ,  జె.సి.డి. ప్రభాకరన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సభా నియమ నిబంధనలపై పట్టున్న వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం ద్వారా పరిపాలనలో పారదర్శకతను పెంచాలని విజయ్ భావిస్తున్నారు.

 ప్రజాస్వామ్య తీర్పు.. మైనారిటీ ప్రభుత్వ సవాల్ 

తమిళనాడు దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తూ టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి సింహాసనాన్ని దక్కించుకుంది. రెండు చోట్లా గెలిచిన విజయ్, ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడంతో టీవీకే బలం 107కు చేరనుంది. డీఎంకే 73 స్థానాలతో ప్రతిపక్ష హోదాకు పరిమితమవ్వగా, ఏఐఏడీఎంకే 53 సీట్లను గెలుచుకుంది. ఈ క్రమంలో 107 సీట్లతో మైనారిటీ ప్రభుత్వాన్ని విజయ్ ఎలా నడిపిస్తారు? విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రజల కనీస అవసరాల విషయంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెస్తారు? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.                                                        


 

టాప్ హెడ్ లైన్స్

Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget